ETV Bharat / bharat

ఈ నెల 15న సంసద్ టీవీ ప్రారంభం - సంసద్ టీవీని ప్రారంభించనున్న వెంకయ్య నాయుడు

పార్లమెంట్ ఉభయ సభల టీవీ ఛానెళ్లను కలిపి ఏర్పాటైన సంసద్ టీవీ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉప రాష్ట్రపతి, ప్రధాని, లోక్​సభ స్పీకర్​ల చేతుల మీదుగా ఈ నెల 15న సంసద్​ టీవీ ప్రారంభం కానుంది.

Sansad TV
సంసద్ టీవీ
author img

By

Published : Sep 13, 2021, 7:42 PM IST

సంసద్ టీవీ ఛానెల్​ను ఈ నెల 15న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా ఈ ఛానెల్​ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు.

సంసద్​ టీవీ అంటే..

పార్లమెంట్​ సంబంధిత వార్తలను ప్రసారం చేసే.. లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ రెండింటిని కలుపుతూ.. కొత్త ఛానెల్​ను తీసుకురావాలనే నిర్ణయంతో ఏర్పాటైందే ఈ సంసద్ టీవీ.

ఉభయ సభల టీవీ ఛానెళ్లను కలుపుతూ.. సంసద్​ టీవీ ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్యసభ సచివాలయం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అధికారికంగా ప్రకటించింది. నిజానికి దీనిపై గత ఏడాది జూన్​లోనే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తాజాగా సంసద్​ టీవీ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.

ఇదీ చదవండి: 'నీట్ నుంచి మినహాయింపు'.. అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.