ETV Bharat / bharat

పీఎంసీ కేసులో సంజయ్​ రౌత్ భార్య విచారణ - సంజయ్​రౌత్​ సతీమణి ఈడీ ముందు హాజరు

పంజాబ్​, మహారాష్ట్ర కోపరేటివ్​ (పీఎంసీ) బ్యాంకు కుంభకోణం కేసులో భాగంగా శివసేన సీనియర్​ నేత సంజయ్​ రౌత్​ సతీమణి వర్షా రౌత్ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) ముందు హాజరయ్యారు. ప్రవీణ్​ రౌత్​ ఖాతా​ నుంచి రూ.55లక్షలు వర్షా రౌత్ అకౌంట్​కు బదిలీ కావటంపై ప్రశ్నించారు ఈడీ అధికారులు.

Sanjay Raut's wife appears before ED
పీఎంసీ కుంభకోణంలో ఈడీ ఎదుట హాజరైన సంజయ్​రౌత్​ భార్య
author img

By

Published : Jan 4, 2021, 7:01 PM IST

పీఎంసీ బ్యాంకు కుంభకోణం విచారణ కోసం శివసేన సీనియర్​ నేత సంజయ్​ రౌత్​ సతీమణి వర్షా రౌత్ ఈడీ ముందు హాజరయ్యారు. ప్రవీణ్​ రౌత్​ ఖాతా​ నుంచి రూ.55లక్షలు వర్షా రౌత్ అకౌంట్​కు బదిలీ కావటంపై ఈడీ అధికారులు ప్రశ్నించారు.

జనవరి 5న వర్ష ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా ఒక్కరోజు ముందే హాజరయ్యారు. వర్షా రౌత్​కు గతంలోనూ ఈడీ రెండు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే అనారోగ్య కారణాలు చూపి ఆమె హాజరు కాలేదు.

కేసు ఎందుకు?

గతంలో పీఎంసీ బ్యాంకు నుంచి ప్రవీణ్​ రౌత్​ రూ.95కోట్ల రుణం పొందారు. దాదాపు రూ. కోటీ 60 లక్షలు ప్రవీణ్​ రౌత్​ ఖాతా నుంచి అతని భార్య మాధురీ రౌత్ ఖాతాకు బదిలీ అయ్యాయి. రూ.55లక్షలు వడ్డీ కింద రెండు విడతల్లో వర్షా రౌత్​కు ఇచ్చినట్లు ఈడీ విచారణలో తేలింది. 2010లో రూ.50లక్షలు, 2011లో మరో 5లక్షలు వర్షా రౌత్​ అకౌంట్​కు బదిలీ కావటంపై విచారించారు. ఈ డబ్బును తూర్పు దాదర్ ప్రాంతంలో ఓ ఫ్లాట్​ కొనేందుకు వినియోగించారన్న దానిపైనా ఈడీ విచారణ జరిపింది.

అయితే ఈడీ చర్యలపై మండిపడ్డారు వర్షా రౌత్​ భర్త సంజయ్​రౌత్. సాధారణ గృహిణిని టార్గెట్ చేయటం 'పిరికి పందల చర్య' అని వ్యాఖ్యానించారు.

2019లో పీఎంసీ బ్యాంకు రూ.4,355కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు తేలగా ఆర్​బీఐ ఆ బ్యాంకుపై ఆంక్షలు విధించింది.

ఇదీ చదవండి : సంజయ్​ రౌత్ భార్యకు ఈడీ సమన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.