ETV Bharat / bharat

పోలియో చుక్కలని.. శానిటైజర్ వేశారు​ - dose of polio in Yavatmal

పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో జరిగిన నిర్లక్ష్యానికి 12 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. పోలియో చుక్కలు అనుకొని.. చిన్నారులకు శానిటైజర్​ వేశారు సిబ్బంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరగ్గా.. తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్​ విచారణకు ఆదేశించారు.

Sanitizer administered as a dose of polio in Yavatmal of Maharashtra
పోలియో చుక్కలని.. 12 మంది పిల్లలకు శానిటైజర్​
author img

By

Published : Feb 1, 2021, 6:03 PM IST

మహారాష్ట్ర యావత్మాల్​ జిల్లాలో పల్స్​ పోలియో పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి జరిగింది. ఘటాంజి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పిల్లలకు పోలియో చుక్కలకు బదులు శానిటైజర్​ వేసినట్లు తేలింది. ప్రస్తుతం వారు.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు.

Sanitizer administered as a dose of polio in Yavatmal of Maharashtra
చిన్నారులను పరామర్శిస్తున్న కలెక్టర్​

ఆ పిల్లలు తొలుత వాంతులు చేసుకోవడం వల్ల చికిత్స కోసం రాత్రికి రాత్రే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఎం.దేవేందర్​ సింగ్​ ఆసుపత్రిని సందర్శించారు. ఘటనపై ఆరా తీశారు. దీనిపై పూర్తి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ​

ఇదీ చూడండి: '2021లో సాధారణ స్థాయిలోనే నైరుతి రుతుపనాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.