Sangli Mass Suicide: మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని మ్హైసాల్లో ఒకే కుటుంబంలో 9 మంది మరణించిన ఘటనలో.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరిది ఆత్మహత్య కాదని.. హత్య అని తేల్చారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మాంత్రికుల్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు ఎస్పీ దీక్షిత్ గేడామ్. గుప్తనిధుల కోసం.. వీరిపై విషప్రయోగం జరిపారని పేర్కొన్నారు. నిందితులు ధీరజ్ చంద్రకాంత్ సురవశే, అబ్బాస్ మొహ్మద్ అలీ బాగ్వాన్ను అదుపులోకి తీసుకున్నారు.
జూన్ 20న మ్హైసాల్లోని ఒకే ఇంట్లో 9 మంది విగతజీవులుగా పడి ఉండటం కలకలం రేపింది. పశువైద్యుడు డా. మాణిక్ యల్లప్ప వాన్మోర్, పోపట్ యల్లప్ప వాన్మోర్, ఆయన తల్లి, భార్య, పిల్లలు సహా మొత్తం 9 మంది మృతదేహాలు ఒకే ఇంట్లో కనిపించాయి. అయితే.. మృతుడి జేబులో సూసైడ్ నోట్ చూసి ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకున్నారు పోలీసులు.
తదనంతర విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. ఇంట్లో మృతదేహాలు పడి ఉన్న తీరు చూసి అనుమానంతో పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వాన్మోర్ కుటుంబానిది ఆత్మహత్య కాదు.. సామూహిక హత్యలు అని తేల్చారు. వారందరిపై విష ప్రయోగం చేసి, చంపేశారని వెల్లడించారు.
ఇవీ చూడండి: దేశంలో భారీ దాడులకు ఉగ్రకుట్ర.. ఆ భక్తులే టార్గెట్.. హోంశాఖ హైఅలర్ట్!
వెల్లివిరిసిన మతసామరస్యం.. పండిట్ల వివాహానికి ముస్లింలే పెళ్లి పెద్దలు