ETV Bharat / bharat

Sanatana Dharma Remark Row : 'స్టాలిన్​పై కఠిన చర్యలు తీసుకోవాలి'.. సుప్రీంకోర్టుకు 262 మంది ప్రముఖుల లేఖ - సనాతన ధర్మం తమిళనాడు స్టాలిన్

Sanatana Dharma Remark Row : సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్​పై బీజేపీ సహా హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. తాజాగా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు సహా మొత్తం 262 మంది కలిసి సుప్రీం కోర్టుకు లేఖ రాశారు.

Sanatana Dharma Remark Row
Sanatana Dharma Remark Row
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 2:01 PM IST

Updated : Sep 5, 2023, 2:28 PM IST

Sanatana Dharma Remark Row : సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్​పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు సహా మొత్తం 262 మంది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలో అత్యధిక శాతం జనాభా ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడారని లేఖలో పేర్కొన్నారు. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన స్టాలిన్.. కనీసం క్షమాపణ చేప్పేందుకు కూడా ఒప్పుకోలేదని ఆరోపించారు లేఖలో సంతకం చేసిన దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఎన్​ ధింగ్రా.

  • 262 eminent personalities write a letter to Chief Justice of India, urge "suo moto cognisance of hate speech made by Udhayanidhi Stalin that could incite communal disharmony and sectarian violence". pic.twitter.com/rnZtkfZMCq

    — Press Trust of India (@PTI_News) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Sanatana Dharma Supreme Court : దేశ లౌకిక స్వభావాన్ని కాపాడేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఆయా ప్రముఖులంతా ప్రధాన న్యాయమూర్తిని కోరారు. అతి తీవ్రమైన అంశాల్లో చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తే.. అది కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని లేఖలో పేర్కొన్నారు. స్టాలిన్​పై చర్యలు తీసుకోవడంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. న్యాయాన్ని కాపాడేందుకు తమ అభ్యర్థనను స్వీకరిస్తారని ఆశిస్తున్నట్లు అందులో చెప్పారు.

స్టాలిన్​ హిట్లర్​తో పోల్చిన బీజేపీ
Stalin On Sanatana Dharma Bjp Reaction : మరోవైపు స్టాలిన్​ను జర్మనీ నియంత హిట్లర్​తో పోల్చింది బీజేపీ. భారత్​లో సనాతన ధర్మాన్ని పాటించే 80 శాతం జనాభాకు వ్యతిరేకంగా మాట్లాడి.. మారణహోమానికి పిలుపునిచ్చారని దుయ్యబట్టింది. అలాంటి వారికి కాంగ్రెస్​, ఇండియా కూటమి మద్దతు తెలుపుతోందని మండిపడింది. హిట్లర్​ యూదులను ఎలా ఊచకోత కోయాలని చెప్పారో.. అచ్చం అలాగే స్టాలిన్​ సనాతన ధర్మంపై వ్యాఖ్యానించారని విమర్శించింది.

  • There is eerie similarity between how Hitler characterised the Jews and Udhayanidhi Stalin described Sanatan Dharma. Like Hitler, Stalin Jr also demanded, that Sanatan Dharma be eradicated… We know how Nazi hate culminated in Holocaust, killing approx 6 million European Jews and… pic.twitter.com/bu1MNWGq6Z

    — BJP (@BJP4India) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

స్టాలిన్​కు​ భద్రత కట్టుదిట్టం
Stalin On Sanatana Dharma : ఉదయనిధి స్టాలిన్‌కు బెదిరింపుల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గతవారం చెన్నైలో జరిగిన తమిళనాడు ప్రగతిశీల రచయితలు, కళాకారుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉదయనిధి స్టాలిన్‌.. సనాతన ధర్మం సమానత్వం, సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, మహిళల పట్ల వివక్షకు కారణమని పేర్కొన్నారు. అందువల్ల సనాతన ధర్మాన్ని వ్యతిరేకించటం కాకుండా నిర్మూలించాలని పిలుపునిచ్చారు.

  • #WATCH | Security tightened outside the residence of Tamil Nadu Minister Udhayanidhi Stalin in Chennai after he was given a death threat regarding his 'Sanatana Dharma should be eradicated' remark. pic.twitter.com/r3HSLCBmab

    — ANI (@ANI) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించిన కేజ్రీవాల్​
తమిళనాడు మంత్రి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​. అందరూ ఇతర మతాలను గౌరవించాలని.. ఇతరుల నమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. తాను కూడా సనాతన ధర్మానికి చెందినవాడినేనని చెప్పుకొచ్చారు.

Stalin On Sanatana Dharma BJP : స్టాలిన్​పై బీజేపీ ఫైర్.. క్షమాపణకు రాజ్​నాథ్ డిమాండ్.. తమ సిద్ధాంతం అదేనన్న కాంగ్రెస్!

Udhayanidhi Stalin Statement : సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు.. వారసత్వ గర్వమేనన్న అమిత్ షా

Last Updated : Sep 5, 2023, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.