ETV Bharat / bharat

'ప్రతి రోజూ పార్లమెంట్​ ఎదుట ఆందోళన చేస్తాం' - కొత్త సాగు చట్టాలు

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడే రైతు సంఘాలు ఆందోళన చేయాలని నిర్ణయించాయి. పార్లమెంట్​ భవనం ముందు దాదాపు 200 మంది రైతులతో.. సమావేశాలు ముగిసేవరకు ప్రతిరోజు నిరసన తెలపనున్నట్లు వెల్లడించింది. ప్రతిపక్ష ఎంపీలు రైతులకు మద్దతు తెలపాలని కోరుతామని తెలిపాయి.

Samyukt Kisan Morcha
రైతు సంఘాలు ఆందోళన
author img

By

Published : Jul 4, 2021, 9:24 PM IST

వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు.. వర్షాకాల సమావేశాలు జరిగే పార్లమెంట్​ భవనం ముందు ధర్నా చేస్తామని తెలిపారు. దాదాపు 200 మంది ప్రతిరోజు నిరసన తెలపనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్​కేఎమ్​) ఆదివారం వెల్లడించింది. సభలో ఆందోళన చేయాలని విపక్ష సభ్యులకు హెచ్చరికలు జారీ చేస్తూ జులై 17న లేఖలు పంపిస్తామని ఎస్​కేఎమ్​ తెలిపింది. సమావేశాలు ముగిసేవరకు రైతులకు మద్దతు తెలపాలని కోరనున్నట్లు వెల్లడించింది. జులై 19న పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవనున్నాయి.

"మేము హౌస్​ బయట ఆందోళన చేపడతాం. లోపల సభ్యులకు మా డిమాండ్​లు వినిపించేలా చేస్తాం. విపక్ష ఎంపీలు పార్లమెంట్ లోపల ప్రతిరోజూ కొత్త సాగు చట్టాల అంశాన్ని లేవనెత్తాలని కోరతాం. మా సమస్యలు వారు వినేదాక పోరాడతాం. సెషన్​ బయటకు వచ్చి కేంద్రానికి మేలు చేయకూడదని చెబుతాం. మా సమస్యలకు పరిష్కారం ఇవ్వకుండా సమావేశాలను విజయవంతం చేయకూడదు. ప్రతీ రైతు సంఘం నుంచి కనీసం ఐదుగురు సభ్యుల చొప్పున ఆందోళనల్లో పాల్గొంటాం."

- బల్​బీర్​ సింగ్ రాజేవాలా, రైతు నాయకుడు

దేశవ్యాప్తంగా నిరసన..

దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా జులై 8న ఆందోళన చేపట్టాలని ఎస్​కేఎమ్​ పిలుపునిచ్చింది. డీజిల్​, పెట్రోల్​, ఎల్​పీజీ ధరలు ఆకాశన్నంటుతున్నందున.. జాతీయ రహదారులపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాహనాలను నిలిపి ఉంచాలని కోరింది.

"మీ దగ్గర ఏ వాహనం ఉంటే.. ఆ వాహనాన్ని హైవే పై ఉంచండి. ట్రాక్టర్, ట్రాలీ, స్కూటర్​, కార్ ఐదైనా.. దగ్గరలోని జాతీయ రహదారిపైకి తీసుకురండి. కానీ ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేయవద్దు. మధ్యాహ్నం 12 గంటలకు ఎనిమిది నిమిషాల పాటు వాహనాల హారన్​లను మోగించండి. ఎల్​పీజీ సిలిండర్లను కూడా రహదారులపైకి తీసుకురండి. దేశవ్యాప్తంగా జరిగే ఈ నిరసన ప్రదర్శనలో పాలుపంచుకోండి."

- బల్​బీర్​ సింగ్ రాజేవాలా​, రైతు నాయకుడు

రైతులతో చర్చలకు సిద్ధమేనన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ఎలాంటి నిబంధనలు లేకుండా చర్చలకు ఆహ్వానిస్తేనే అంగీకరిస్తామని బల్​బీర్​ సింగ్​ అన్నారు. సాగు చట్టాలను రద్దు చేసేందుకు అంగీకరిస్తేనే చర్చలకు సిద్ధమని తెలిపారు.

సాగు చట్టాలు విప్లవాత్మకం..

దేశంలో కొత్తగా తీసుకువచ్చిన సాగు చట్టాలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తాయని​ తోమర్ జులై 1న పునరుద్ఘాటించారు. చట్టాల రద్ధు మినహా ఎలాంటి ప్రస్తావనకైనా.. రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.

కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా 2020 నవంబర్​ నుంచి రైతులు దిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్నారు. దాదాపు 40 సంఘాలు ఒకే గొడుగు కిందికి చేరి ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. పదుల సంఖ్యలో రైతులు ప్రాణాలు కోల్పోయారు. కేంద్రానికి, రైతు సంఘాలకు మధ్య పలు మార్లు చర్చలు జరిగినా ఎటూ తేలకుండానే ముగిశాయి. తాజాగా పార్లమెంట్​ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రైతు సంఘాలు నిరసనకు పూనుకున్నాయి.

ఇవీ చదవండి:'రఫేల్ డీల్​'​పై రాహుల్​ సర్వే

'వైద్యులందరికీ ఈ ఏడాది భారతరత్న!'

150 మంది ముస్లిం మేధావులతో సీఎం భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.