ETV Bharat / bharat

'తాలిబన్లు స్వేచ్ఛ కోరుకుంటున్నారు.. తప్పేంటి?' - talibans wants freedom comments

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు స్వేచ్ఛ కోరుకుంటున్నారని సమాజ్​వాదీ పార్టీ ఎంపీ షఫికర్​ రహమాన్​ బార్క్​ వ్యాఖ్యానించారు. వారి చర్యలను భారత స్వాతంత్య్రోద్యమంతో పోల్చి చెప్పారు. దీనిపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ ఘాటుగా స్పందించారు. కాగా, ఎంపీపై దేశద్రోహం కేసు నమోదైంది.

Shafiqur Rahman Barq
షఫికర్​ రహమాన్​ బార్క్​
author img

By

Published : Aug 18, 2021, 5:36 AM IST

Updated : Aug 18, 2021, 9:13 PM IST

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంపై సమాజ్​వాదీ పార్టీ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాలిబన్లు తమ దేశాన్ని స్వేచ్ఛగా ఉంచాలని కోరుకుంటున్నారని ఉత్తర్​ప్రదేశ్​ సంభాల్ లోక్​సభ ఎంపీ షఫీకర్ రహమమాన్​ బార్క్​ వ్యాఖ్యానించారు. దీన్ని భారత స్వాతంత్ర్యోద్యమంతో పోల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

"అఫ్గాన్​లో రష్యా, అమెరికా అజమాయిషీని తాలిబన్లు అనుమతించటం లేదు. ప్రస్తుతం వారు తమ దేశాన్ని తామే పరిపాలించాలనుకుంటున్నారు. దేశాన్ని బ్రిటిష్​ పరిపాలించినప్పుడు.. వారికి వ్యతిరేకంగా దేశమంతా కలిసి పోరాడింది. అదే తరహాలో వారు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. అది వారి అంతర్గత వ్యవహారం. దాంట్లో మన ఎలా జోక్యం చేసుకోగలం?"

-షఫికర్​ రహమాన్​ బార్క్, ఎంపీ

కాగా, ఈ విషయంపై దేశద్రోహం చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. భాజపా నేత రాజేశ్ సింఘాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

యోగి మండిపాటు

బార్క్​ వ్యాఖ్యలపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ మండిపడ్డారు. తాలిబన్లను బార్క్​ సమర్థించడం సిగ్గు చేటన్నారు.

"మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నాం. అలాంటి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం? మానవత్వాన్ని మంటలో కలిపేస్తున్న వారికి మనం మద్దతునిస్తున్నాం."

-యోగి ఆదిత్యానాథ్​, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి

అంతకుముందు ఉత్తర్​ప్రదేశ్​ ఉపముఖ్యమంత్రి కేశవ్​ ప్రసాద్​ మౌర్య కూడా బార్క్​ వ్యాఖ్యలను ఖండించారు. "నేను ఎంపీ మాటలను వినలేదు. కానీ, ఇలాంటి వ్యాఖ్యలను ఆయన చేసినట్లైతే.. ఆయనకు, పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​కు పెద్ద తేడా లేదు" అని చెప్పారు.

ఇదీ చూడండి: శాంతి జపంతో మీడియా ముందుకు తాలిబన్లు

ఇదీ చూడండి: అఫ్గాన్​పై మోదీ కీలక భేటీ- వారిని తీసుకురావాలని ఆదేశం!

Last Updated : Aug 18, 2021, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.