ETV Bharat / bharat

ఆ స్టేషన్లలో ప్లాట్​ఫామ్​ టికెట్ల అమ్మకాలు బంద్!​ - మధ్య రైల్వే అధికార ప్రతినిధి శివాజీ సుతార్​

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. రైల్వే స్టేషన్​లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ముంబయి రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సీఎస్​ఎమ్​టీ సహా మొత్తం 6 స్టేషన్లలో ప్లాట్​ఫామ్​ టికెట్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేసింది.

Sale of platform tickets stopped at six Mumbai stations: CR
ప్లాట్​ఫామ్​ టికెట్​ అమ్మకాలపై ముంబయి రైల్వే నిషేధం
author img

By

Published : Apr 9, 2021, 1:27 PM IST

Updated : Apr 9, 2021, 2:21 PM IST

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో.. ముంబయి రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించడమే లక్ష్యంగా.. ప్లాట్​ఫామ్ టిక్కెట్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

మొత్తం 6 స్టేషన్లలో ప్లాట్​ఫామ్​ టికెట్​ విక్రయాలను నిలిపివేయనున్నట్లు సెంట్రల్​ రైల్వే ప్రతినిధి శివాజీ సుతార్​ తెలిపారు. ఛత్రపతి శివాజీ మహరాజ్​ టెర్మినస్​(సీఎస్​ఎమ్​టీ)తో పాటు లోక్​మాన్య తిలక్​ టెర్మినస్​(ఎల్​టీటీ), కల్యాణ్​, ఠాణే, దాదర్​, పన్వేల్ రైల్వే​ స్టేషన్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని సుతార్​ పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకే ఈ చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు.

ఇప్పటికే.. కరోనా మహమ్మారి నేపథ్యంలో రద్దీని నివారించేందుకు గత మార్చి నెలారంభంలో రాష్ట్రంలోని పలు రైల్వేస్టేషన్లలో ప్లాట్​ఫామ్ టికెట్​ ధరలను భారీగా పెంచింది ముంబయి రైల్వే. రూ.10గా ఉన్న టికెట్​ ధరను రూ.50గా మార్చింది.

ఇదీ చదవండి: 'విమానంలో పుట్టిందని జనన ధ్రువీకరణ ఇవ్వటం లేదు'

Last Updated : Apr 9, 2021, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.