Sabarimala Rush Today: ఓవైపు దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నెలకొన్న క్రమంలో.. శబరిమలలో భక్తులు పోటెత్తారు. శనివారం రికార్డు స్థాయిలో 42,354 మంది దర్శనం చేసుకున్నట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. శుక్రవారం 27,840 మంది దర్శనం చేసుకున్నారని పేర్కొంది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు పోలీసులు.. శానిటైజ్ చేసి, మాస్కులు అందిస్తున్నారని వివరించింది.

డిసెంబరు 9 నుంచి వర్చువల్ క్యూ పద్ధతిలో బుకింగ్ చేసుకునే విధానం పూర్తవుతుందని స్పష్టం చేసింది. వర్చువల్ బుకింగ్తో పాటు రోజూ దాదాపు 5వేల మంది భక్తులకు స్పాట్ బుకింగ్ అనుమతిస్తున్నట్లు పేర్కొంది.

మండల- మహావిరక్కు కోసం శబరిమల ఆలయాన్ని తెరిచారు. డిసెంబరు 26 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. సంక్రాంతి సందర్భంగా డిసెంబరు 30న మళ్లీ శబరిమల ఆలయం తెరుచుకుంటుంది. జనవరి 20 వరకు భక్తులను అనుమతిస్తారు.
ఇదీ చూడండి: టీకా తీసుకోమన్నందుకు రాయితో కొట్టబోయిన వృద్ధుడు- వీడియో వైరల్