రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబరు 6న భారత పర్యటనకు రానున్నారు. 21వ భారత్-రష్యా వార్షిక సదస్సు(India-russia annual summit 2021) కోసం ఆయన దిల్లీ చేరుకోనున్నారు. ప్రధానమంత్రి మోదీతో కలిసి(Putin with modi) దిల్లీలో జరిగే సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
ఈ వార్షిక సదస్సులో భాగంగా భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలపై(India russia relations) ఇరు దేశాల ప్రతినిధులు కీలక చర్చలు జరుపుతారు. గతేడాది కరోనా కారణంగా ఈ సదస్సు వాయిదా పడింది. ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 20 సార్లు ఈ సదస్సు జరిగింది.
2 ప్లస్ 2 భేటీ..
భారత్, రష్యా విదేశాంగ, రక్షణ మంత్రుల తొలి 2 ప్లస్ 2 సమావేశం(Russia india two plus two ministerial meeting) డిసెంబరు 6న జరగనుందని అరిందమ్ బాగ్చి తెలిపారు. "భారత్ తరఫున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈ భేటీకి హాజరవుతుండగా.. రష్యా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్, రక్షణ శాఖ మంత్రి సెర్గెయ్ షోయిగు పాల్గొంటారు. వారు డిసెంబరు 5-6 మధ్య భారత్లో పర్యటించనున్నారు" అని వివరించారు.
ఇదీ చూడండి: న్యాయవ్యవస్థ రక్షణకు సహకరించండి: జస్టిస్ రమణ