ETV Bharat / bharat

ఉక్రెయిన్ గగనతలం మూసివేత.. ఎయిర్ఇండియా విమానం వెనక్కి - ఎయిర్ఇండియా విమానం ఉక్రెయిన్

Air India Flight returns to Delhi: ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావాల్సిన ఎయిర్ఇండియా విమానం.. అర్ధంతరంగా భారత్​కు తిరుగుపయనమైంది. విమాన రాకపోకలపై ఉక్రెయిన్ నిషేధం విధించిన నేపథ్యంలో.. విమానాన్ని భారత్​కు మళ్లించారు.

UKRAINE AIR INDIA FLIGHT RETURN
UKRAINE AIR INDIA FLIGHT RETURN
author img

By

Published : Feb 24, 2022, 11:14 AM IST

Ukraine air space closed: రష్యా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో.. ఎయిర్​పోర్టులను, గగనతలాన్ని మూసివేస్తూ ఉక్రెయిన్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఆ దేశ రాజధాని కీవ్​కు బయల్దేరిన ఎయిర్ఇండియా విమానం వెనుదిరిగింది.

Air India Flight return to Delhi:

ఉదయం 7.30 గంటలకు ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి 'ఏఐ1947' ఎయిర్ఇండియా విమానం బయల్దేరి వెళ్లింది. కీవ్​లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇది చేరుకోవాల్సి ఉంది. గగనతలాన్ని మూసేస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించిన నేపథ్యంలో.. విమానాన్ని వెనక్కి పిలవాలా? లేదా ప్రయాణాన్ని కొనసాగించాలా? అని భారత అధికారులు చర్చించి.. వెనక్కి పిలిపించేందుకే మొగ్గుచూపారు.

అదేసమయంలో, కీవ్ నుంచి బయల్దేరిన ఓ విమానం గురువారం ఉదయం 7.45 గంటలకు దిల్లీలో ల్యాండ్ అయింది. 182 మంది భారతీయులు ఈ విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు.

'ఎలా తీసుకురావాలో అన్వేషిస్తాం'

ఉక్రెయిన్​లోని భారత పౌరులు, విద్యార్థుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ నుంచి సాధారణ విమానాల రాకపోకలు కొనసాగడం లేదని పేర్కొంది. 'గగనతలాన్ని మూసేసిన నేపథ్యంలో భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు మార్గాలను అన్వేషిస్తున్నాం. ఉక్రెయిన్​లోని భారత రాయబార కార్యాలయం పనిచేస్తూనే ఉంటుంది' అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్యారిస్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్.. భారత్​కు తిరుగుపయనమయ్యారు.

గగనతలం మూసివేత

రష్యా వరుస దాడుల నేపథ్యంలో తూర్పు ఉక్రెయిన్​ తన గగనతలాన్ని డేంజర్​ జోన్​గా ప్రకటించింది. సాధారణ విమాన ప్రయాణాలను నిషేధించింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.