ETV Bharat / bharat

ఉక్రెయిన్​లో యుద్ధం.. భారత పౌరుల తరలింపు వేగవంతం - రష్యా ఉక్రెయిన్ యుద్ధం భారత పౌరులు

Russia Ukraine crisis: ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటికి ఆరు విమానాలు భారత్​కు చేరుకోగా.. మరిన్ని విమానాలు స్వదేశానికి వస్తున్నాయి.

Russia-Ukraine crisis
Russia-Ukraine crisis
author img

By

Published : Mar 1, 2022, 6:05 PM IST

Russia Ukraine crisis: ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపు చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన 'ఆపరేషన్​ గంగ'లో భాగంగా... హంగేరీ నుంచి బయలుదేరిన విమానం దిల్లీ చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ వారికి స్వాగతం పలికారు. ఉక్రెయిన్​లో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

Evacuation of Indians from Ukraine

బుచారెస్ట్​ నుంచి బయలుదేరిన మరో విమానం ద్వారా 182 మంది భారతీయులు స్వదేశాన్ని చేరుకున్నారు. వీరికి కేంద్ర మంత్రి నారాయణ్​ రాణె స్వాగతం పలికారు. బుడాపెస్ట్​ నుంచి 216 మందితో ఓ విమానం భారత్​కు బయల్దేరింది.

Russia-Ukraine crisis
బుచారెస్ట్ నుంచి వచ్చిన విమానం

భారతీయుల తరలింపు ప్రక్రియను సమన్వయం చేసేందుకు కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు స్లొవేకియాకు వెళ్లారు. స్పైస్​జెట్​కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన దిల్లీ నుంచి బయల్దేరారు. రాత్రి 7.50 గంటలకు స్లొవేకియాలోని కోసైస్​కు ఈ విమానం చేరుకోనుంది. మార్చి 3న ఉదయం 7.40 గంటలకు విమానం తిరిగి భారత్​కు రానుంది.

"స్లొవేకియా నుంచి భారత పౌరుల తరలింపు ఆపరేషన్​ను సమన్వయం చేస్తాం. అక్కడి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులకు వీసాలు వచ్చేలా ప్రయత్నిస్తాం. విద్యార్థులందరినీ సురక్షితంగా భారత్​కు తీసుకురావడమే మా ప్రథమ లక్ష్యం."

-కిరెన్ రిజిజు, కేంద్ర మంత్రి

పౌరుల తరలింపు కోసం స్పైస్​జెట్ నడిపిస్తున్న రెండో విమానం ఇది. ఇప్పటికే హంగరీలోని బుడాపెస్ట్​కు ఓ విమానాన్ని పంపింది స్పైస్​జెట్. మరిన్ని ఫ్లైట్లను పంపేందుకు అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటివరకు 9 వేల మందికి పైగా భారతీయులు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు.

Russia-Ukraine crisis
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ

రాష్ట్రపతితో విదేశాంగ మంత్రి

ఉక్రెయిన్​ నుంచి భారతీయ పౌరుల తరలింపునకు సంబంధించిన వివరాలను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు విదేశాంగ మంత్రి జైశంకర్ వివరించారు. 'ఆపరేషన్ గంగ' పురోగతిపై సోమవారం రాత్రి కోవింద్​కు వివరాలు తెలియజేశారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోవింద్ ఆహ్వానించారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. కేంద్రం తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతి ప్రశంసించారని తెలిపింది.

రంగంలోకి వాయుసేన

'ఆపరేషన్​ గంగ' కోసం వాయుసేన రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వాయుసేనకు చెందిన సీ-17 విమానాలను ఇందుకు వినియోగించనున్నారు. దీని ద్వారా తక్కువ సమయంలో మరింత మందిని తరలించేందుకు వీలవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఉక్రెయిన్​ రాజధాని కీవ్​లో ఉన్న భారతీయులు తక్షణమే ఆ నగరాన్ని విడిచి వెళ్లాలంటూ అక్కడి భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది.

విద్యార్థి మృతి

మరోవైపు, ఉక్రెయిన్‌- రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఖార్కీవ్‌ ప్రాంతంలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన పేలుళ్లలో విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందర్‌ బాగ్చి తెలిపారు. అతడిని కర్ణాటకకు చెందిన నవీన్​ జ్ఞానగౌడార్​గా గుర్తించారు.

ఇదీ చదవండి:

'కీవ్'​ లక్ష్యంగా రష్యా దూకుడు.. 65 కి.మీ. పొడవున మోహరింపులు

ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో భారతీయ విద్యార్థి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.