RTC Bus Fell into Vally at Paderu Ghat Road: పాడేరు అటవీ ప్రాంతానికి కీలకమైన ఘాట్‌రోడ్ రక్తపు మడుగులతో నిండిపోతోంది. సురక్షిత ప్రయాణినికి నెలవైనా.. పాడేరు ఘాట్‌రోడ్ వరుస ప్రమాదాలతో ప్రయాణికులను వణికిస్తోంది. ఆదివారం జరిగిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. క్షతగాత్రుల ఆర్తనాదాలతో మన్యం ప్రాంతామంతా ధ్వనించింది.
సురక్షిత ప్రయాణానికి భరోసా అని ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయించగా.. ప్రమాదం సంభవించటంతో ప్రయాణికులంతా ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. పెరుగుతున్న వాహనాల రద్దీకి తగిన విధంగా.. ఘాట్ విస్తరణ లేకపోవటం, ముందస్తు జాగ్రత చర్యలు తీసుకోకపోవటమే బస్సు ప్రమాదానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.
అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లగా.. ఈ ప్రమాదంలో వృద్ధ మహిళతో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో చిన్నారులతో సహా.. 30 మంది వరకు గాయపడ్డారు. ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపాయింట్ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. పాడేరుకు విశాఖ నుంచి బయల్దేరిన బస్సు.. మరో 20 నిమిషాల్లో పాడేరు చేరుకుంటుందనే సమయంలో లోయలోకి జారిపోయింది. విశాఖ నుంచి పాడేరుకు సుమారు 4గం.. ప్రయాణం. అందులో గంటన్నరకు పైగా పాడేరు ఘాట్ రోడ్డుపైనే ప్రయాణం సాగుతుంది.
కేరళలో ప్రమాదానికి గురైన ఏపీ యాత్రికుల బస్సు.. 18మందికి గాయాలు
ఘాట్ రోడ్డులో ఇటీవల మూల మలుపు వద్ద చెట్టు కొమ్మలు రోడ్డుపై విరిగిపడ్డాయి. వాటిని తొలగించకుండా అలాగే ఉంచారు. పాడేరుకు బయల్దేరిన బస్సు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తప్పించి ముందుకు సాగింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించపోయి అదుపుతప్పి లోయలో పడిపోయినట్లు ప్రయాణికులు చెప్తున్నారు.50 అడుగులలోతు వరకు లోయలోకి వెళ్లిన బస్సు.. ఓ చెట్టు అడ్డుతగలటంతో ఆగిపోయింది. చెట్టు అడ్డుతగలకపోయి ఉంటే.. ప్రాణ నష్టం మరింత ఉండేదని ప్రత్యక్షసాక్షులు వివరిస్తున్నారు.
బస్సు ఒక్కసారిగా లోయలోకి వెళ్లడంతో అందులో ఉన్న 40 మంది ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఏం జరిగిందో తెలుసుకొనేలోపే బస్సు లోయలోకి జారిపోయింది. ఈ ప్రమాందలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయం బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నించినా.. సెల్ఫోన్లకు సిగ్నల్స్ అందుబాటులో లేక ఇబ్బందిపడ్డారు.
School Bus Overturned : బస్సు నిండా విద్యార్థులు.. ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా.. లైవ్ వీడియో
సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయ చర్యలు చేపట్టి.. ప్రయాణికుల్ని కాపాడారు. గాయాలతో రక్తమోడుతున్న క్షతగాత్రులను అతికష్టం మీద లోయలోంచి పైకి లాగారు. కొందరిని బస్సులో, మరికొందరిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ సత్తిబాబుకు తీవ్రగాయాలయ్యయి.
బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారు సబ్బవరం మండలం సూరెడ్డిపాలేనికి చెందిన ఈశ్వరరావు, ఆయన భార్య నారాయణమ్మగా పోలీసులు గుర్తించారు. వీరు పాడేరులోని వారి కుమారుడైన వెంకటరమణ కుటుంబాన్ని చూసేందుకు వృద్ధ దంపతులు బయల్దేరారు. ప్రమాదంలో నారాయణమ్మ తీవ్రంగా గాయపడి అక్కడే ప్రాణాలు కోల్పోగా.. భర్త ఈశ్వరరావును పాడేరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నారాయణమ్మ మరణంతో వారి స్వగ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో ఏడాది వయసులోపున్న చిన్నారిని.. తల్లి ఒడిలో దాచుకుని సురక్షితంగా కాపాడుకుంది. చిన్నారికి ఎటువంటి గాయాలు కాకపోవటంతో చూసిన వారు ఒకింత సంతోషం వ్యక్తం చేశారు. కానీ, తల్లి జ్యోతికి మాత్రం తలకు గాయాలయ్యయి. స్థానిక ఎస్పీ సహాయ చర్యలను పర్యవేక్షించారు.
ఓవర్టేక్ చేయబోయి బైక్‌ను ఢీకొట్టిన బస్సు
పాడేరు ఘాట్‌రోడ్డులోని ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగుర్ని మెరుగైన చికిత్స కోసం విశాఖలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో బొట్టా నర్సింహమూర్తి, బొట్టా చిన్నమ్మలు, బొట్టా రమణ (11), బొట్టా దుర్గాభవాని (14) ఉన్నారని జిల్లాధికారులు వివరించారు. అనకాపల్లి జిల్లా యర్రవరం ప్రాంతానికి చెందిన వీరు మోదకొండమ్మ అనే మహిళ.. దైవ దర్శనానికి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు.
ప్రమాద ఘటన వద్ద కలెక్టర్: బస్సు ప్రమాద బాధితులను అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ పరామర్శించారు. ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు గాయపడినట్లు ఆయన వివరించారు. మెరుగైన చికిత్స కోసం నలుగురు క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందిస్తామని ప్రకటించారు.
School Bus Accident: పంట పొలాల్లో పల్టీకొట్టిన స్కూల్ బస్సు.. 14మంది విద్యార్థులకు గాయాలు
ప్రమాదంపై స్పందించిన సీఎం జగన్ : పాడేరులో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనకు కారణాలపై దృష్టి సారించాలని సూచించారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీడీపీ అధినేత: పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్: పాడేరు ప్రమాద ఘటనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. వ్యూ పాయింట్ వద్ద బస్సు ప్రమాదం కలచి వేసిందని అన్నారు. ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి: పాడేరు బస్సు ప్రమాద ఘటనపై బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని విశాఖ తరలించి వైద్యం అందించాలని అన్నారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.
స్కూల్ బస్సు- కారు ఢీ.. ఆరుగురు మృతి.. రాంగ్ రూట్లో రావడం వల్లే..