కేరళలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) కార్యకర్తను గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు. మృతుడు వయలార్‌కు చెందిన రాహుల్ కృష్ణ అలియాస్ నందుగా పోలీసులు గుర్తించారు.
అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి చెర్తలకు సమీపంలోని నాగమ్కులనగర్లో ది సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ), ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాహుల్ కృష్ణ అలియాస్ నందు అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతి చెందాడని, ముగ్గురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు, ఆరుగురు ఎస్డీపీఐ కార్యకర్తలు గాయపడ్డారని వెల్లడించారు.
ఇస్లామిస్ట్ అవుట్‌ఫిట్ పాపులర్ ఫ్రంట్(పీఎఫ్ఐ)కు ఎస్డీపీఐ అనుబంధ శాఖ. కాగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తను హత్య చేసింది పాపులర్ ఫ్రంట్ కార్యకర్తలేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ ఆరోపించారు.
ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతికి నిరసనగా భాజపాతో పాటు హిందూ సంస్థలు అలప్పుజలో 12 గంటల పాటు బందుకు పిలుపునిచ్చాయి.
ఇదీ చూడండి: శబరిమల నిరసనకారులపై కేసులు వెనక్కి!