ETV Bharat / bharat

ఆపరేషన్​ యూపీ: దిల్లీకి ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ - మోహన్ భగవత్ దిల్లీ పర్యటన యూపీ

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల కోసం ఆర్​ఎస్​ఎస్​ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సంస్థ అధినేత మోహన్ భగవత్.. గురువారం దిల్లీకి వెళ్లనున్నారు. దిల్లీలోని ఆర్​ఎస్​ఎస్​ కీలక ప్రతినిధులతో సమావేశం కానున్నారు. యూపీ అంశంపైనే వీరు ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

RSS Mohan Bhagwat Delhi UP
ఆరెస్సెస్ చీఫ్ దిల్లీ పర్యటన- యూపీపైనే ఫోకస్!
author img

By

Published : Jun 2, 2021, 3:43 PM IST

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ గురువారం దిల్లీకి వెళ్లనున్నారు. సంస్థకు చెందిన ప్రతినిధులతో వరుస అనధికార సమావేశాలు నిర్వహించనున్నారు. ఇది సాధారణ పర్యటనేనని అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. ఆర్​ఎస్​ఎస్​ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే సైతం సమావేశానికి హాజరు కానున్నట్లు చెప్పారు.

త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తర్​ప్రదేశ్​పైనే సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో పరిస్థితులను హోసబలే దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​కు ఆయన వివరించనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇతర నేతలతోనూ చర్చలు

ఆర్​ఎస్​ఎస్​ సహ సర్కార్యవాస్​లైన కృష్ణన్ గోపాల్, మన్మోహన్ వైద్య, హెచ్ఆర్ ముకుంద, రామ్ దత్, అరుణ్ కుమార్​ సైతం దిల్లీలోనే ఉన్నారు. వీరితోనూ భగవత్ చర్చలు జరపనున్నారు. ఆరెస్సెస్ అధిష్ఠానం మొత్తం ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల విషయంపై సుదీర్ఘ విశ్లేషణ జరిపే అవకాశం ఉందని సమాచారం.

వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

సహాయ కార్యక్రమాలపై

యూపీతో పాటు త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కరోనా కట్టడి చర్యల గురించి భగవత్​కు సంస్థ ప్రతినిధులు వివరించనున్నారు. సంఘ్ చేపట్టిన సహాయ కార్యక్రమాల గురించి చెప్పనున్నారు. భగవత్ కొద్దిరోజుల పాటు దిల్లీలోనే ఉండే అవకాశం ఉందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.

ఇదీ చదవండి- ట్విట్టర్​లో ఆ 50 మందిని 'అన్​ఫాలో' చేసిన రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.