ETV Bharat / bharat

'అయోధ్య రామునికి రూ.100 కోట్ల విరాళాలు' - అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ. 100కోట్ల విరాళాలు

అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ.100కోట్ల విరాళాలు వచ్చాయని రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ వెల్లడించారు. మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ చేపట్టిన విరాళాల కార్యక్రమం ఫిబ్రవరి 27తో ముగియనుంది.

rs.100crors  donations to ayodya rama mandhir consrtuction
'అయోధ్య రామునికి 100 కోట్ల విరాళం'
author img

By

Published : Jan 17, 2021, 3:35 PM IST

అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాల వరద పారుతోంది. ఇప్పటివరకు రూ.100కోట్ల విరాళాలు వచ్చాయని రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ వెల్లడించారు.

"పూర్తి సమాచారం ప్రధాన కార్యాలయానికి చేరలేదు. కానీ మా కార్యకర్తల సమాచారం మేరకు ఇప్పటికే రూ.100కోట్ల విరాళాలు వచ్చాయి."

-చంపత్​ రాయ్​,రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి

అయోధ్యలో రాముని గుడి నిర్మాణానికి శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ విరాళాలు సేకరిస్తోంది. ఫిబ్రవరి 27తో ఈ కార్యక్రమం ముగియనుంది.

మందిర నిర్మాణానికి రాష్ట్రపతి విరాళం ఇవ్వడంపై అడిగిన ప్రశ్నలకు రాయ్​ స్పందించారు. అందులో ఎలాంటి తప్పులేదని అన్నారు. రాష్ట్రపతి ఓ భారతీయుడేనని.. ప్రతి భారతీయుడిలోను రాముడు ఉంటాడని అన్నారు. ఈ సర్వోన్నత కార్యానికి శక్తి కలిగిన ప్రతి ఒక్కరూ సాయం చెయ్యవచ్చని అన్నారు.

ఇదీ చదవండి:జీ7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన బ్రిటన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.