ETV Bharat / bharat

Young Farmer : ఉద్యోగం వదిలి.. 'పూల'బాటలో యువరైతు

ROSE CULTIVATION: బహుళ జాతి సంస్థలో ఉద్యోగం.. ఐదెంకల్లో జీతం.. విలాసవంతమైన జీవితం.. ఇవేవీ ఆ యువకుడికి సంతృప్తినివ్వలేదు. ఎక్కడో ఏదో అసంతృప్తి. తన ఆలోచనలు, ఆసక్తులు వేరే ఉన్నాయని గ్రహించిన ఆ యువకుడు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సొంత ఊరికి చేరుకుని తన మనసుకు నచ్చిన వ్యవసాయాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. మొదట్లో ఆటుపోట్లు, సవాళ్లు ఎదురైనా.. ధైర్యంగా నిలబడ్డాడు. ఇప్పుడు తాను ఎంచుకున్న రంగంలో మంచి ఆదాయం గడిస్తూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతకీ ఎవరా యువకుడు, అతను చేస్తున్న వ్యవసాయం ఏంటో తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి.

ROSE CULTIVATION
ROSE CULTIVATION
author img

By

Published : Apr 29, 2023, 1:16 PM IST

రోజా పూల తోటలో మణిపృథ్వి

ROSE CULTIVATION: ఇక్కడ రోజా పూల తోటలో తిరుగుతూ.. పూల మొక్కలను నిశితంగా పరిశీలిస్తున్న ఈ యువకుడి పేరు మణిపృథ్వి. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం కళ్లచెరువుకు చెందిన పృథ్వి ఇంజనీరింగ్ పూర్తి చేసి చెన్నైలో ఓ బహుళ జాతి సంస్థలో ఇంజనీర్​గా పనిచేస్తున్నాడు. బాగా సంపాదిస్తున్నా.. పృథ్విలో ఏదో తెలియని అసంతృప్తి. ఎక్కడి నుంచో వచ్చి.. ఎవరో చెప్పింది చేయడం ఆ యువకుడికి నచ్చలేదు. తన ఆలోచనలు, ఇష్టాయిష్టాలు, ఆసక్తులు వేరే ఉన్నాయని గుర్తించిన యువకుడు వెంటనే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సొంత గ్రామానికి చేరుకుని వ్యవసాయం ప్రారంభించాడు.

సొంత పొలంతో పాటు.. కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని అందులో తైవాన్ జామ సాగు ప్రారంభించాడు. అయితే వ్యవసాయంపై మక్కువ ఉన్నా.. ఈ రంగంలో పెద్దగా అవగాహన లేకపోవడంతో తొలుత ఎదురుదెబ్బలు తిన్నాడు. ఆర్థికంగానూ నష్టపోయాడు. అయితే వ్యవసాయం చేయాలన్న పట్టుదలను మాత్రం వదల్లేదు. మరింత లోతుగా ఆలోచించి.. ఈ సారి ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలకు తావులేకుండా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఈ సారి తైవాన్ జామ సాగు కాకుండా రోజా పూల సాగు మొదలుపెట్టాడు.

తైవాన్ జామ సాగులో ఎదురైన ఫలితాలు పునరావృతం కాకూడదనుకున్నాడో లేక ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదన్న సంకల్పమో ఏమో.. రోజా పూల సాగులో అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. రోజా పూల సాగు ప్రారంభించే ముందు దానిపై కొంత పరిశోధన చేశాడు. తమిళనాడులోని డెంకనికొట్టై అనే ప్రాంతంలో 6 నెలల పాటు ఉండి.. రోజా పూల సాగులో మెళకువలు నేర్చుకున్నాడు. చీడపీడల నివారణ, యాజమాన్య పద్ధతులు, మొక్కలకు అంటుకట్టడం.. ఇలా అన్ని అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు. అనంతరం తన గ్రామానికి వచ్చి 15 ఎకరాల్లో రోజా పూల సాగు మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ యువకుడు సెంట్, బెంగుళూరు అనే రెండు వెరైటీలను సాగు చేస్తున్నాడు. పెట్టుబడి ఎక్కువైనా, మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా.. వాటన్నింటినీ అధిగమించి ఇప్పుడు రోజా పూల తోటలో లాభాల సాగు చేస్తున్నాడు.

ప్రస్తుతం నెలకు 3 నుంచి 4 టన్నుల దిగుబడి సాధిస్తున్న మణిపృథ్వి మార్కెటింగ్ లోనూ తనదైన మార్కు చూపిస్తున్నాడు. సొంతంగా వాహనం సమకూర్చుకుని నిత్యం వచ్చిన పూలను వచ్చినట్లుగా దగ్గర్లోని మార్కెట్లకు పంపిస్తూ ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ 22 ఎకరాలతో దేశంలోనే అత్యధిక ఎకరాల్లో రోజా పూల సాగు చేస్తూ మొదటి స్థానంలో ఉన్న మణిపృథ్వి.. పెట్టుబడులు అధికం కావడం, కూలీల కొరత, కౌలు రెట్టింపు కావడం కారణంగా కొంత తగ్గించి పస్తుతం 15 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. తాను వ్యవసాయం చేసి లాభాలు ఆర్జించడమే కాకుండా నిత్యం 10 నుంచి 12 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. రోజా పూల సాగు ఎవరైనా చేయవచ్చంటున్న పృథ్వి.. ముందుగా యాజమాన్య పద్ధతులను అనుసరించడం ముఖ్యమని చెబుతాడు. ఓ వైపు రోజా పూల సాగుచేస్తూనే మరోవైపు డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తున్న మణిపృథ్వి....రెండు చేతులా సంపాదిస్తూ....ఉద్యోగానికి రాజీనామా చేశానన్న బాధ ఏనాడూ కలగలేదంటున్నాడు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.