Rooster exhibition: ఈ కోడి పుంజు ధర చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. వెయ్యి.. రెండు వేలు కాదు.. ఏకంగా మూడున్నర లక్షల రూపాయల ధర పలికింది. ఇంతకీ ఆ పుంజుకు అంత ధర ఎందుకు పెట్టారు? ఆ పుంజు ప్రత్యేకత ఏమిటి?
తమిళనాడు దిండిగుల్ జిల్లాలో ఆదివారం కోడి పుంజుల ప్రదర్శన నిర్వహించారు. అంతరించిపోతున్న చిలక ముక్కు కోడి పుంజులపై అవగాహన కల్పించేందుకే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ చిలుక ముక్కు కోడి పుంజుల తోక సుమారు 1 మీటర్ పొడువు ఉంటుంది.
ఈ ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి నుంచి సుమారు 400కుపైగా పుంజులు వచ్చాయి. అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఓ పుంజు ఏకంగా రూ.3.5 లక్షల ధర పలికింది. దానికి గల పదునైన ముక్కు, రంగు, బరువు, పొడువైన తోక, ఎత్తు, శరీరక దారుఢ్యం, పందెంలో పోటీపడగల సత్తా వంటి వాటిని గమనించి మనసు పారేసుకున్న ఓ వ్యక్తి ఇంత భారీ ధర పెట్టి కొనుగోలు చేశారు.
భారీ ధర పలికిన ఈ కోడి పుంజు అందరి దృష్టిని ఆకర్షించింది. దానిని చూసేందుకు అక్కడికి వచ్చిన వారు ఎగబడ్డారు.
ఇదీ చూడండి: తల్లి పాలలో పాషాణం.. ఆ నది నీళ్లే కారణం!