ETV Bharat / bharat

దొంగతనం కోసం వచ్చి.. ఇద్దరు మహిళలపై అత్యాచారం - గ్యాంగ్ రేప్

దొంగతనం కోసం వచ్చి ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారు కొందరు దుండగులు. కత్తులు, గొడ్డళ్లతో ఇంట్లోని పురుషులపై దాడి చేసి బయటకు పంపించారు. అనంతరం ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. మరోవైపు, కేరళలో ఓ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రేమ పేరుతో మైనర్​ను లొంగదీసుకున్న నిందితుడు.. మరో నలుగురితో కలిసి అత్యాచారం చేశాడు.

maharashtra Aurangabad
దొంగతనం కోసం వచ్చి.. ఇద్దరు మహిళలపై అత్యాచారం
author img

By

Published : Oct 20, 2021, 6:20 PM IST

మహారాష్ట్రలోని ఔరంగబాద్ జిల్లాలో (Aurangabad News) దారుణం జరిగింది. పైతాన్ తాలుకాలోని ఓ గ్రామంలో దొంగతనం కోసం వచ్చిన దుండగులు ఇద్దరు మహిళలను రేప్ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు 7-8 మంది దొంగలు.. ఇంట్లోకి చొరబడి పురుషులను చితకబాదారు. కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి దోచుకున్నారు. తర్వాత వారిని ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు.

అనంతరం ఇంట్లో ఉన్న 30 ఏళ్ల మహిళతో పాటు, ఐదు నెలల చిన్నారి తల్లి అయిన 23 ఏళ్ల మహిళపైనా (Gang Rape victim) కనికరం లేకుండా అత్యాచారం చేశారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానిక పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

మైనర్​పై గ్యాంగ్​రేప్

మరోవైపు, కేరళ కోజికోడ్​లో (Kozhikode News) బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు మానవ మృగాళ్లు.. విచక్షణ లేకుండా మైనర్​పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రేమ పేరుతో నిందితుడు.. బాలికను నమ్మించి ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు.

ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరు బాలిక గ్రామానికే చెందినవారు కాగా.. మరొకరు వేరే గ్రామస్థుడని పోలీసులు తెలిపారు.

బాధితురాలి వాంగ్మూలం ప్రకారం.. నిందితుల్లో ఒకడు ప్రేమ పేరుతో బాలికకు దగ్గరయ్యాడు. తనను కలవాలని ఓ రోజు బాలికతో చెప్పి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. మరో ముగ్గురిని పిలిచి బాలికపై అత్యాచారం చేశాడు.

మైనర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చదవండి: విమానంలో నటిపై వేధింపులు.. వ్యాపారవేత్త అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.