ETV Bharat / bharat

సింహం మాస్క్​తో వచ్చి రూ. కోట్లు కొట్టేసిన దొంగ చిక్కాడు

Jos Alukkas Theft: తమిళనాడులో ఇటీవల జాస్​ అలుకాస్​​ స్టోర్​లో చోరీకి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడు నగలను ఓ శ్మశానంలో దాచాడని.. త్వరలోనే వాటిని వెలికితీస్తామని పోలీసులు వెల్లడించారు.

Jos Alukkas theft
'జాస్​ అలుక్కాస్​ దొంగ'ను అరెస్ట్​ చేసిన పోలీసులు
author img

By

Published : Dec 21, 2021, 12:06 PM IST

Updated : Dec 21, 2021, 3:19 PM IST

Jos Alukkas Theft: తమిళనాడు వెల్లూరులో ఇటీవల జాస్​ అలుకాస్​​ స్టోర్​లో దొంగతనానికి పాల్పడ్డ నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఒదుగతుర్​ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టగా.. దొంగతనానికి పాల్పడ్డట్టు తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. చోరీ చేసిన నగలను నిందితుడు.. ఓ శ్మశానంలో దాచి ఉంచాడని వెల్లడించారు. త్వరలోనే ఈ నగలను వెలికితీస్తామని స్పష్టం చేశారు. ఈ దొంగతనంలో నిందితుడికి ఎవరైనా సహకరించారా? అన్న కోణంలోనూ విచారిస్తున్నట్టు స్పష్టం చేశారు.

Jos Alukkas theft
మాస్క్​ ధరించి దొంగతనానికి పాల్పడిన నిందితుడు

తోటపాలయం ధర్మరాజ ఆలయం సమీపంలో ఉన్న జాస్​ అలుకాస్​ స్టోర్​లో ఈనెల 15న.. నిందితుడు 15 కిలోల బంగారం, రూ.8 కోట్లు విలువ చేసే వజ్రాల ఆభరణాలను చోరీ చేశాడు. భవనం వెనుక భాగంలోని గోడకు కన్నం వేసి స్టోర్​​లోకి ప్రవేశించిన నిందితుడు.. తనని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు మాస్క్​ ధరించాడు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఈ చోరీకి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫూటేజ్​ సోషల్​ మీడియాలో వైరలైంది.

ఇదీ చూడండి : భర్త నేలకొరుగుతున్నా.. జెండా ఎగరేసి!

Last Updated : Dec 21, 2021, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.