ETV Bharat / bharat

పిల్లల కోసం ప్రత్యేక బెర్త్​.. రైల్వే శాఖ సరికొత్త ప్రయోగం! - పిల్లలకు బెర్త్​లు

Baby berth in train: రైలులో ప్రయాణించే తల్లీపిల్లల కోసం సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది రైల్వే శాఖ. ఇందులో భాగంగానే చిన్న పిల్లలు పడుకోవడానికి ప్రత్యేకంగా బెర్త్​లను ఏర్పాటు చేసింది. లోయర్​ బెర్త్​ పక్కన వీటిని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం లఖ్​నవూ మెయిల్​ను పైలెట్​ ప్రాజెక్ట్​గా ఎంపిక చేసింది.

child berth in train
పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బెర్త్​
author img

By

Published : May 10, 2022, 4:26 PM IST

Updated : May 10, 2022, 6:26 PM IST

Baby berth in train: ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంత ప్రయాణం అందించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం ఓ సరికొత్త ఏర్పాటును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అదే ఫోల్డబుల్‌ 'బేబీ బెర్త్‌'. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్నపాటి పడక ఇది. లోయర్‌ బెర్త్‌కు అటాచై ఉంటుంది. ప్రయాణ సమయంలో తల్లులు ఈ బెర్త్‌పై తమ శిశువులను పడుకోబెట్టోచ్చు. సాధారణంగా అయితే.. ఒకే బెర్త్‌పై తల్లీబిడ్డ సర్దుబాటు కావాల్సి ఉంటుంది. దీంతో స్థలం సరిపడక.. ఇబ్బందులు తప్పేవి కావు. ఇప్పుడు బేబీ బెర్త్‌ సాయంతో బుజ్జాయిలను తమ పక్కనే సురక్షితంగా పడుకోబెట్టొచ్చు.

child berth in train
పిల్లల కోసం ఏర్పాటు చేసిన బెర్త్​లో
child berth in train
పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బెర్త్​
Baby berth in train
బెర్త్​కు అటాచ్​

'మదర్స్​ డే' సందర్భంగా ఉత్తర రైల్వే డివిజన్ ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం విశేషం. లఖ్‌నవూ, దిల్లీ డివిజన్ల సమన్వయంతో.. లఖ్‌నవూ మెయిల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని త్రీ-టైర్ బీ4 కోచ్‌లో ఈ బెర్త్‌లను పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేసింది. ఈ విషయమై లఖ్‌నవూ డివిజన్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ అతుల్ సింగ్ మాట్లాడుతూ.. 'బేబీ బెర్త్‌ను మెయిన్ లోయర్ బెర్త్‌తో జతచేశాం. అవసరం లేనప్పుడు దీన్ని లోయర్‌ బెర్త్‌ కిందికి మడతపెట్టొచ్చు. దీన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సులభం' అని వివరించారు. 770 మి.మీల పొడవు, 255 మి.మీల వెడల్పు, 76.2 మి.మీల ఎత్తు కలిగిన ఈ బేబీ బెర్త్‌కు శిశువును సురక్షితంగా పట్టి ఉంచడానికి పట్టీలూ ఉన్నాయని చెప్పారు.

ఇదీ చదవండి: మైనారిటీ గుర్తింపు అంశంపై సుప్రీం అసంతృప్తి!

Last Updated : May 10, 2022, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.