ETV Bharat / bharat

'కాంగ్రెస్​తో కలిసి పోటీ చేస్తే డిపాజిట్​ గల్లంతే' - bihar by polls

కాంగ్రెస్​తో పొత్తు కుదుర్చుకోవడం వల్ల తమకు కలిగే ప్రయోజనం ఏంటని ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav News) ప్రశ్నించారు. బిహార్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి సీటు కేటాయిస్తే.. డిపాజిట్​ కూడా దక్కదని వ్యాఖ్యానించారు.

lalu prasad yadav news
లాలూ ప్రసాద్ యాదవ్​
author img

By

Published : Oct 24, 2021, 5:14 PM IST

బిహార్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు సంబంధించి రాష్ట్రీయ జనతా దళ్(ఆర్​జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్(Lalu Prasad Yadav News) ​ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​తో కూటమి వల్ల తమకు ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. బిహార్​ ఉపఎన్నికల్లో(Bihar Bypoll) ఆ పార్టీకీ సీటు కేటాయిస్తే.. డిపాజిట్​ కూడా దక్కదని లాలూ(Lalu Prasad Yadav News) వ్యాఖ్యానించారు.

"కాంగ్రెస్ కూటమి​​తో ఉపయోగమేమిటి? ఓడిపోయేందుకు కాంగ్రెస్​కు సీటు కేటాయించాలా? కాంగ్రెస్​కు సీటు ఇస్తే డిపాజిట్​ కూడా దక్కదు."

-లాలూ ప్రసాద్ యాదవ్​, ఆర్​జేడీ అధినేత

గతంలో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్​జేడీ, కాంగ్రెస్‌ సహా పలు చిన్న పార్టీలు కలిసి మహా​కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో ఆర్​జేడీ విజయం సాధించగా కాంగ్రెస్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ పరిణామంతో బిహార్‌లో అధికారంలోకి రావాలని భావించిన ఆర్​జేడీ ఆశలు ఆవిరయ్యాయి. ఈ నేపథ్యంలో.. రెండు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఆర్​జేడీ.. కాంగ్రెస్​తో పొత్తు వదులుకుంది.

ఇదీ చూడండి: 'యువత భాగస్వామ్యంతోనే కశ్మీర్​లో ఉగ్రవాదానికి అడ్డుకట్ట'

ఇదీ చూడండి: ఈనెల 29న ఇటలీకి మోదీ- జీ20 సదస్సుకు హాజరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.