పంచ్‌లు విసురుతూ పతకాలు తేవాల్సిన ఓ యువ బాక్సర్.. కుటుంబాన్ని పోషించేందుకు పార్కింగ్ టికెట్లు విక్రయిస్తోంది. చంఢీగఢ్‌కు చెందిన రీతు అనే ఈ యువ క్రీడాకారిణి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు గెలుచుకుంది. కానీ ఆర్థిక సమస్యల వల్ల ఇప్పుడు బాక్సింగ్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది.


బాక్సింగ్ పట్ల రీతు ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు అండగా నిలిచినా.. ఆర్థిక సమస్యల కారణంగా రీతూ బాక్సర్‌గా కొనసాగలేకపోయింది. ఆమెకు ప్రభుత్వం నుంచి కానీ, దాతల నుంచి కానీ ఎలాంటి ప్రోత్సాహం అందలేదు. దానికి తోడు ఆమె తండ్రి అనారోగ్యం పాలవడం వల్ల కుటుంబ బాధ్యత రీతు మీద పడింది. దీంతో ఆమె ప్రస్తుతం రాత్రి పగళ్లు పార్కింగ్ టికెట్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
ప్రభుత్వం తనను ఆదుకుటుందని ఆశిస్తున్నానని రీతూ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి : అమితాబ్ నివాసానికి బాంబు బెదిరింపు