ETV Bharat / bharat

'ఓటు హక్కును ప్రతి ఒక్కరు గౌరవించాలి' - జాతీయ 11వ ఓటర్ల దినోత్సవం

ఎన్నోపోరాటాల తర్వాత ప్రతిఒక్కరికీ ఓటు హక్కు వచ్చిందని గుర్తు చేశారు భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్. అలాంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ గౌరవించి, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉందని తెలిపారు.

Right to vote must be respected: President
ఓటు హక్కుని ప్రతి ఒక్కరు గౌరవించాలి: రాష్ట్రపతి
author img

By

Published : Jan 25, 2021, 3:52 PM IST

Updated : Jan 25, 2021, 5:07 PM IST

ప్రపంచంలోని చాలా దేశాలల్లో ప్రజలు ఓటు హక్కు కోసం దశాబ్దాల తరబడి పోరాడాల్సి వచ్చిందని భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పేర్కొన్నారు. ఎంతో శ్రమపడి సాధించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ గౌరవించి, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతీయువకులపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉందన్నారు.

11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికాలో కూడా ఓటు హక్కు కోసం ప్రజలు చాలా కాలం పోరాడారని గుర్తు చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్​లో చాలా కాలం పాటు మహిళలకు ఓటు హక్కు లేదని తెలిపారు.

అయితే స్వాతంత్య్రం వచ్చాక మన దేశ రాజ్యంగం.. 21ఏళ్లున్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్ష లేకుండా ఓటు హక్కు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికి వయస్సును 18 ఏళ్లకు తగ్గించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 'దేశ అభ్యున్నతి కోసం పాటుపడేలా ఆలోచించాలి'

Last Updated : Jan 25, 2021, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.