ETV Bharat / bharat

శబరిమల.. ఆదాయం డీలా! - kerala

కొవిడ్​ కారణంగా కేరళలోని శబరిమల ఆలయ ఆదాయం భారీగా తగ్గింది. ఈ సీజన్​లో కానుకల రూపంలో రూ.16 కోట్లు మాత్రమే వచ్చాయి.

sabarimala temple loss, శబరిమల
శబరిమల.. ఆదాయం డీలా!
author img

By

Published : Jan 15, 2021, 3:41 PM IST

కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ఆదాయం ఈ ఏడాది భారీగా తగ్గింది. ఈ సంక్రాంతి పండుగ సీజన్​లో మంగళవారం నాటికి రూ.16 కోట్లు మాత్రమే వచ్చాయి. గతేడాది వచ్చిన ఆదాయంలో ఇది పది శాతం మాత్రమే.

తగ్గుతున్న ఆదాయం..

2019లో ఆలయ ఆదాయం రూ.166 కోట్లు కాగా, గతేడాది రూ. 60.26 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది కొవిడ్​ కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. దుకాణాల అద్దె, ఇతర వనరుల ద్వారా ట్రావెన్​కోర్​ దేవస్థానానికి వచ్చే ఆదాయం ఈ ఏడాది కోటి రూపాయలకే పరిమితమైంది. ఈ ఆదాయం గతేడాది రూ.6.25 కోట్లుగా ఉంది.

ఆదాయం తగ్గుదల నేపథ్యంలో సాయం అందించాలని దేవస్థానం ఇప్పటికే కేరళ ప్రభుత్వాన్ని కోరింది.

భక్తుల తాకిడి కూడా తగ్గింది..

కొవిడ్​ నిబంధనల కారణంగా.. ఈ ఏడాది పండగ సీజన్​లో కేవలం 1,32,673 మంది యాత్రికులే ఆలయాన్ని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి : భక్తుల శరణుఘోష మధ్య మకరజ్యోతి దర్శనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.