ETV Bharat / bharat

ఉత్కంఠ వీడింది, ఊహించిందే జరిగింది - రేవంత్‌ రెడ్డికే ముఖ్యమంత్రి పగ్గాలు

Revanth Reddy as Telangana CM : ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటన ఎట్టకేలకు వెలువడింది. పార్టీ ఎమ్మెల్యేల ఏకవాక్య తీర్మానం మేరకు అందరూ ఊహించినట్టుగానే రేవంత్‌ రెడ్డికే పగ్గాలు అప్పగిస్తూ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంది. హస్తినలో సుదీర్ఘ చర్చల అనంతరం హైకమాండ్‌ రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించింది.

Revanth Reddy as Telangana CM
Revanth Reddy as Telangana CM
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 6:35 PM IST

Updated : Dec 6, 2023, 6:48 AM IST

ఉత్కంఠ వీడింది, ఊహించిందే జరిగింది - రేవంత్‌ రెడ్డికే ముఖ్యమంత్రి పగ్గాలు

Revanth Reddy as Telangana CM : శాసనసభ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ రెండ్రోజుల కసరత్తుల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంపిక చేసింది. ఈ నెల 3న ఫలితాలు వెలువడిన వెంటనే అప్రమత్తమైన అధిష్ఠానం, గెలిచిన 64 మంది పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌కు తరలించింది. మరుసటి రోజు జరిగిన సీఎల్పీ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఎంపికపై సుదీర్ఘంగా చర్చించగా, ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై చర్చలు కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితుల్లో సీఎల్పీ ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికే వదిలి పెట్టాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయానికి కట్టుబడాలని చేసిన ఏక వాక్య తీర్మానానికి ఎమ్మెల్యేలు ఆమోదించారు.

ముఖ్యమంత్రిగా రేవంత్‌వైపే రాహుల్‌ మొగ్గు

Congress High Command Announced Revanth Reddy as Telangana CM : రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ, ఎమ్మెల్యేల తీర్మానంతో దిల్లీ వెళ్లిన ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్, మాణిక్‌రావ్ ఠాక్రే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక, ఇతర అంశాలపై చర్చించారు. ఈ కీలక భేటీలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ భేటీలో ముఖ్యమంత్రిగా రేవంత్ పేరునే రాహుల్ గాంధీ సూచించగా, ఈ భేటీ అనంతరం తమ అభిప్రాయాలు చెప్పుకునేందుకు దిల్లీ వచ్చిన ఉత్తమ్‌, భట్టిలతో కేసీ వేణుగోపాల్‌ సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సీఎల్పీ నేతగా రేవంత్‌ రెడ్డి పేరును ప్రకటించారు. ఈ నెల ఏడో తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్‌ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు.

కొత్త సీఎల్పీ నేత ఎంపికపై సోమవారం భేటీ జరిగింది. కాంగ్రెస్‌కు విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశాం. సీఎల్పీ భేటీపై డీకే శివకుమార్‌, మాణిక్‌రావు ఠాక్రే నివేదిక ఇచ్చారు. నివేదికపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో చర్చలు జరిగాయి. కొత్త సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకోవాలని నిర్ణయించాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే కొత్త ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తాం. తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించడమే మా ధ్యేయం. వన్‌మెన్‌షోగా ఉండదు. కలిసికట్టుగా ముందుకు సాగుతాం. - కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

మరోవైపు సీఎంగా రేవంత్‌ రెడ్డి పేరు ప్రకటనకు ముందు ఆయనకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దాంతో గచ్చిబౌలి ఎల్లా హోటల్‌ నుంచి రేవంత్‌ నేరుగా దిల్లీకి పయనమయ్యారు. అంతకుముందు డీకే శివకుమార్‌తో సమావేశమైన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తన అభిప్రాయాల్ని వెల్లడించారు. సీఎం రేసులో తాను ఉన్నట్లు తెలిపిన ఉత్తమ్‌, హైకమాండ్‌ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో ఎలాంటి గందరగోళం లేదన్న ఆయన ఫలితాలు వచ్చి 48 గంటలు కూడా కాకుండానే సీఎం అభ్యర్థి నిర్ణయంపై జాప్యం జరుగుతోందనడం సరికాదన్నారు.

సీఎం అభ్యర్థిగా అధిష్ఠానం ఎవరి పేరు ప్రకటించినా నాకు నో ప్రాబ్లమ్ : ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

కొత్తగా కొలువుదీరనున్న కేబినెట్ - మంత్రులుగా ఛాన్స్​ వీరికేనా?

Last Updated : Dec 6, 2023, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.