ETV Bharat / bharat

ప్రేయసికి మరొకరితో నిశ్చితార్థం.. తుపాకీతో కాల్చి చంపిన ప్రియుడు - గ్వాలియర్​ న్యూస్​

Retired soldier murdered his wife: భార్యపై అనుమానంతో గొడ్డలితో నరికి చంపాడు భర్త. తర్వాత పోలీస్​ స్టేషన్​ వెళ్లి లొంగిపోయాడు. మరో ఘటనలో ప్రియురాలికి మరొకరితో నిశ్చితార్థం జరిగిందనే మనస్తాపంతో ఆమెను చంపి.. అనంతరం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Retired soldier murdered his wife
Retired soldier murdered his wife
author img

By

Published : May 18, 2022, 6:59 AM IST

Retired soldier murdered his wife: భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో గొడ్డలితో నరికి చంపాడు భర్త. అనంతరం పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన హరియాణాలోని సిర్సాలో జరిగింది. దీంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతురాలి బంధువులు పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

బరాగూడ గ్రామానికి చెందిన రిటైర్డ్ సైనికుడు గుర్మెల్​ సింగ్​కు మొదటి వివాహం జరగగా భార్య మరణించింది. తర్వాత మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే, గత కొంత కాలంగా తన భార్య ప్రవర్తనను అనుమానిస్తున్నాడు. ఇదే విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన గుర్మెల్​.. భార్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలి తరఫు బంధువులు పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆందోళన చేపట్టారు.

ప్రియురాలిని చంపి ఆపై ఆత్మహత్య చేసుకన్న ప్రియుడు: ప్రియురాలిని చంపి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ప్రేమికుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో జరిగింది. మురార్​ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతి.. 25 ఏళ్ల యువకుడు ప్రేమించుకుంటున్నారు. యువతికి అనేక సార్లు ఆర్థిక సహాయం కూడా చేశాడు. ఆమెకు ఇటీవలే మరొకరితో నిశ్చితార్థం జరిగింది. సోమవారం సాయంత్రం తన సోదరితో కలిసి మార్కెట్​కు వెళ్లి వస్తుండగా.. తుపాకీతో కాల్చి చంపాడు యువకుడు. అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో రెండు తుపాకులు, మోటార్​ సైకిల్​ను పోలీసులు​ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: అస్థికలు కలిపివస్తుండగా విషాదం.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.