ఆయనో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి.. మొక్కలంటే చాలా ఇష్టం.. వాటిని పెంచడం అంటే మహా ఇష్టం. దాన్నే తన హాబీగా మార్చుకున్నారు. తన ఇంట్లో దాదాపు 400 రకాల బొన్సాయ్ మొక్కలను పెంచుతున్నారు. వాటిని పూర్తిగా సేంద్రియ పద్దతుల్లో సాగు చేస్తున్నారు. దీంతో ఆయన్ను స్థానిక ప్రజలు 'బొన్సాయ్ బాబా'గా పిలుస్తున్నారు. ఆయనే ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌కు చెందిన రవి త్రివేది. ఏళ్ల వయస్సు నుంచే ఇంటి పెరట్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు త్రివేది. బొన్సాయ్ అంటే పెద్ద పెద్ద చెట్లను.. మొక్కల సైజులో పెంచే పద్ధతి. ఈ మొక్కల పెంపకం గురించి తెలుసుకున్న త్రివేది.. ఎటువంటి శిక్షణ లేకుండానే వీటిని సాగు చేస్తున్నారు. చాలా మందికి కానుకలుగా కూడా ఇచ్చారు. రాజ్‌భవన్‌కు, సీఎమ్‌కు కూడా పంపిచినట్లు మొక్కలు పంపించినట్లు త్రివేది తెలిపారు.
నా దగ్గర రుద్రాక్ష మొక్కలు, కాఫీ మొక్కలు, తమలపాకు, బిర్యానీ ఆకు చెట్లు ఉన్నాయి. అదే విధంగా 47 ఏళ్ల మర్రి చెట్టు, 27 ఏళ్ల రావి చెట్టు కూడా ఉంది. దానిమ్మ మొక్కలు, అంజీర మొక్కలు, కొబ్బరి చెట్లు, దానిమ్మ, యాలకులు, జామకాయ, మల్బరీ, శమీ, పీచు, పనియాల వంటి మొక్కలు కూడా ఉన్నాయి.
-రవి త్రివేది, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి
ఇంట్లో పెరిగే మిగతా మొక్కల కంటే బొన్సాయ్ మొక్కల సంరక్షణ క్లిష్టంగా ఉంటుందని.. వీటి పెంపకంలో చాలా జాగ్రత్తలు, మెలకువలు పాటించాలని త్రివేది చెబుతున్నారు. బొగ్గు, వేప, జింక్, భాస్వరం కలిపిన బోన్ మీల్ ఎరువులను మొక్కలకు వేయాలని సూచిస్తున్నారు. మొక్కను సకాలంలో కత్తిరించడం, ప్రత్యేక సాంకేతికతతో నీరు పోయడం వంటి చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇలా చేస్తేనే మొక్కలు ఆరోగ్యవంతంగా ఉంటాయంటున్నారు. సాధారణంగా ఈ మొక్కలు పెరిగేందుకు 5 నుంచి 10 సంవత్సరాల సమయం పండుతుందని, తాను పాటించే పద్ధతులు అనుసరిస్తే కేవలం 5 నుంచి 7 ఏడేళ్లలోనే పెరుగుతాయంటున్నారు త్రివేది.