ETV Bharat / bharat

మూడోసారి గెలిస్తే 'మోదీ'కి ప్రత్యామ్నాయంగా 'దీదీ'!

author img

By

Published : Mar 18, 2021, 5:34 PM IST

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నా.. బంగాల్​ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. టీఎంసీ, భాజపా నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. సీఎం పీఠాన్ని మూడోసారి అధిరోహించటం మమతకు కాస్త కష్టంగానే కనిపిస్తున్నా... గెలిస్తే మాత్రం జాతీయస్థాయిలో రాజకీయాలు మారతాయని అంటున్నారు విశ్లేషకులు.

West Bengal tough for Mamata
మూడోసారి గెలిస్తే 'మోదీ'కి ప్రత్యామ్నాయంగా 'దీదీ'!

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా తృణమూల్​ కాంగ్రెస్​, భాజపా మధ్యే పోటీ కనిపిస్తోంది. ఇరు పార్టీలు నువ్వానేనా అన్నట్లు ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో అధికార పీఠాన్ని తిరిగి దక్కించుకోవటం ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాస్త ఇబ్బందిగానే కనిపిస్తోంది. కానీ, అధికారాన్ని చేజిక్కించుకుంటే మాత్రం.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే నేతగా ఎదిగేందుకు అది ఎంతగానో ఉపయోగపడనుంది.

mamata
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

భాజపా వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయాలన్న మమత లక్ష్యం వివిధ సందర్భాల్లో ఆమె మాటల ద్వారానే స్పష్టమైంది. ప్రధాని మోదీ, ఆయన విధానాలపై తరచుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు మమత. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్​ కొద్ది కాలంగా అంతగా ప్రభావం చూపటం లేదు. అది కూడా జాతీయ స్థాయిలో పాత్రపై టీఎంసీ నేతల కలలకు ఊతమిస్తోంది.

జాతీయవాదం కార్డుతో భాజపా..

కొన్నేళ్ల రికార్డులు చూస్తే.. హిందుత్వం, జాతీయవాదం కార్డులతో భాజపా లబ్ధి పొందుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అది బంగాల్​లో 2019 లోక్​సభ ఎన్నికల్లో 42 సీట్లకు గాను 18 సీట్లు గెలుచుకోవటం ద్వారా రుజువైంది.

బంగాల్​ ఎన్నికల నగారా మోగిన క్రమంలో తమ ప్రచార జోరును పెంచింది భాజపా. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా రంగంలోకి దిగారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, శాంతిభద్రతల పరిస్థితులను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. శ్రీరాముడి పేరుతో హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు.

మరోవైపు.. బంగాల్​లో దూకుడుగా కనిపిస్తున్న కమలదళం.. బలమైన పార్టీగా మారటంలో కొంత వెనకబడిందనే చెప్పాలి. స్థానిక నేతలు లేకపోవటం వల్ల టీఎంసీ నుంచి ఎక్కువ మందిని చేర్చుకోవటాన్ని చూస్తే అది తేటతెల్లమవుతోంది.

లోకల్​xఔటర్స్​

భాజపాను ఎదుర్కొనేందుకు మమతా బెనర్జీ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. లోకల్​xఔటర్స్​ ప్రచారం చేపట్టారు. తాను బంగాల్​ కుమార్తెనని, బయట వారిని కాంకుండా బంగాల్​ ప్రజలు సొంత కుమార్తెను కావాలనుకుంటున్నారని నినదించారు. నందిగ్రామ్​లో కాలికి గాయమైన తర్వాత చక్రాల కుర్చీలోనే ప్రచారం చేస్తున్నారు. మమత కాలికి కనిపిస్తున్న కట్టు.. ఆమెకు కొంత మేర లాభం చేకూర్చొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా..

మూడోసారి అధికారంలోకి వస్తే భాజపాను అడ్డుకోగల శక్తి తనకు ఉందని మమతా బెనర్జీ నిరూపించినట్లవుతుంది. అదే.. జాతీయ స్థాయిలో భాజపాకు ప్రత్యామ్నాయ కూటమికి నాయకత్వం వహించే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేంజ్రీవాల్​, డీఎంకే చీఫ్​ ఎంకే స్టాలిన్​ వంటి కీలక నేతల మద్దతును కూడగట్టి భాజపాను ఎదుర్కొనేందుకు యత్నించారు మమత. ఇప్పుడు 'బంగాల్​ దంగల్​'లో విజేతగా నిలిస్తే... ఈ ప్రయత్నాలు మరింత ముమ్మరమయ్యే అవకాశముంది. అయితే.. కాంగ్రెస్​ అగ్రనేతలకు ఈ ఆలోచన నచ్చకపోవచ్చు.

ఇదీ చూడండి: బంగాల్ దంగల్: విజయానికి 'ఆమె' ఓట్లే కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.