తీవ్రగాయాల పాలై ప్రాణాపాయ స్థితిలో దొరికిన పది మీటర్ల పొడవైన కొండ చిలువను ఒక స్వచ్ఛంద సంస్థ.. అటవీశాఖ సిబ్బంది సాయంతో కాపాడింది. ముంబయిలోని ఒక కాలువలో పడి ఉన్న కొండ చిలువను రెస్కింక్ అసోషియేషన్ ఫర్ వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్, అటవీశాఖ సిబ్బంది ఆగస్టులో గుర్తించారు. దాని శరీరంలో అనేక చోట్ల విరగడం వల్ల.. పైథాన్‌కు తీవ్ర గాయాలైనట్లు గుర్తించారు. నోటిలోనూ గాయాలు కావడం వల్ల కొండ చిలువ ఆహారం తీసుకోలేని పరిస్థితికి చేరుకుంది.
చావు అంచులకు వెళ్లిన సమయంలో కొండ చిలువను బతికించేందుకు స్వచ్చంద సంస్థ చొరవ తీసుకుంది. కొందరు వెటర్నరీ డాక్టర్ల బృందం సాయంతో రెస్కింక్ అసోషియేషన్ ఫర్ వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్ అనే స్వచ్ఛంద సంస్థే కొండ చిలువకు చికిత్స చేయిస్తోంది. తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ కొండ చిలువ చికిత్సకు స్పందిస్తోంది. ఇప్పటికే కొండ చిలువకు రెండు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. అటవీశాఖ సిబ్బంది వారికి కావాల్సిన సహకారాన్ని అందిస్తున్నారు. ఆహారం తీసుకునే నాళం దెబ్బతినడం వల్ల తాజాగా కొండచిలువకు రీకన్‌స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీని చేశారు.
కొండ చిలువ పూర్తిస్థాయిలో కోలుకుంటే తిరిగి అడవిలో వదలిపెట్టాలని అటవీశాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు భావిస్తున్నారు. అది పూర్తికోలుకుని.. అడవిలో తిరిగే స్థాయికి చేరుకోవడానికి మరికొన్ని నెలలు పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: అమిత్ షా టూర్లో కలకలం.. ఆంధ్రా ఎంపీ పీఏ అంటూ హల్చల్.. చివరకు...
'దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా?'.. హిజాబ్ కేసులో సుప్రీం వ్యాఖ్యలు