ETV Bharat / bharat

'ఆపరేషన్​ ఉత్తరాఖండ్'​లో మరో అవాంతరం - డ్రిల్లింగ్​ ఆపరేషన్​ పనులు

ధౌళిగంగ జలవిలయం తర్వాత కొనసాగుతున్న సహాయక చర్యలకు మరో ఆటంకం ఎదురైంది. తపోవన్​ టన్నెల్ వద్ద ఈ ఉదయం డ్రిల్లింగ్​ ప్రారంభించినా.. యంత్రం​ పాడవడం వల్ల ఆ ప్రయత్నం ఆగిపోయింది. మిగిలిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Rescue operation suspended temporarily as the machine broke down: Ashok Kumar, DGP Uttarakhand
జలప్రళయం: డ్రిల్లింగ్ ఆపరేషన్​​ నిలిపివేత
author img

By

Published : Feb 11, 2021, 2:00 PM IST

ఉత్తరాఖండ్​ జలప్రళయం తర్వాత కొనసాగుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకం ఎదురవుతుంది. వరదలో గల్లంతై.. తపోవన్​ సొరంగంలో చిక్కుకున్నట్లు భావిస్తున్న వారిని రక్షించేందుకు చేపట్టిన డ్రిల్లింగ్ ఆపరేషన్​ అర్ధాంతరంగా నిలిచిపోయింది. తవ్వకాలు జరిపే యంత్రం​ చెడిపోవడం వల్ల తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్​ తెలిపారు. ఇతర ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్​ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

uttarakhand flood disaster operations are under progress to find missing workers in tunnel
కూలీలు చిక్కుకుని ఉంటారని భావిస్తోన్న సొరంగం..

సొరంగ మార్గం లోపలి దృశ్యాలు

జలవిలయం కారణంగా ఇప్పటి వరకు 35 మంది మరణించగా.. 204 మంది గల్లంతయ్యారని ఆ రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది.

చమోలీ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య పర్యటించారు.

ఇదీ చదవండి: సొరంగంలోని వారి కోసం జోరుగా సహాయక చర్యలు

ఆటంకాలు ఎదురైనా.. జోరుగా సహాయక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.