ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మరో 11 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీనితో మొత్తం మృతుల సంఖ్య 58కి చేరింది. మరో 146మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను జోషి మఠ్లోని తపోవన్ సొరంగంలో గుర్తించినట్లు పేర్కొన్నారు. జాతీయ విపత్తు దళం, ఇండో టిబెటన్ పోలీస్తో కలిసి చమోలీ జిల్లాలో గాలింపు చర్యలు చేస్తున్నట్లు వివరించారు.
![rescue-operation-continues-at-raini-village-in-glacier-burst-of-chamoli-incident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10644001_img.jpg)
జోషిమఠ్ వద్ద నందాదేవి హిమానీనదం బద్దలవ్వడం వల్ల రిషిగంగ నదిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. 13.2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. రిషి గంగా, ధౌలీ గంగా సంగమం వద్ద ఉన్న ఎన్టీపీసీకి చెందిన మరో జల విద్యుత్ ప్రాజెక్టు పాక్షికంగా ధ్వంసమైంది.
ఇదీ చదవండి : ఆపరేషన్ తపోవన్: సొరంగానికి రంధ్రం