ETV Bharat / bharat

'కరోనా పాజిటివ్ రిపోర్టు లేకున్నా చేర్చుకోవాలి' - corona positive report not mandatory

కరోనా లక్షణాలున్న వారిని పాజిటివ్ రిపోర్టు లేకున్నా కొవిడ్​ ఆరోగ్య కేంద్రాల్లో చేర్చుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. బాధితులు ఏ ప్రాంతానికి చెందిన వారు, గుర్తింపు కార్డు ఉందా? అనే విషయాలతో సంబంధం లేకుండా సేవలు అందించాలని ఆదేశించింది. ఈ మేరకు కరోనా రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకునే జాతీయ విధానాన్ని సవరించింది.

positive test for COVID-19 virus is not mandatory
'కరోనా పాజిటివ్ రిపోర్టు లేకున్నా చేర్చుకోవాలి'
author img

By

Published : May 8, 2021, 3:09 PM IST

Updated : May 8, 2021, 4:37 PM IST

కరోనా రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు రూపొందించిన జాతీయ విధానాన్ని సవరించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇకపై కరోనా పాజిటివ్​ రిపోర్టు లేకున్నా రోగులను కొవిడ్ ఆరోగ్య​ కేంద్రాల్లో ప్రవేశం కల్పించాలని స్పష్టం చేసింది. వైరస్ లక్షణాలున్న ఎవరినైనా చేర్చుకోవాల్సిందేనని పేర్కొంది. రోగులు ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే.. సేవలు అందించాలని సూచించింది. సరైన గుర్తింపు కార్టు లేదని, స్ధానికుల కాదనే కారణంతో ఎవరినీ ప్రవేశానికి నిరాకరించవద్దని తేల్చి చెప్పింది. ఔషధాలు, ఆక్సిజన్​ వంటి సేవలు అందరికీ అందించాలని పేర్కొంది. దేశంలో కరోనా ప్రళయం కొనసాగుతున్న వేళ వైరస్‌ బాధితులకు కేంద్రం నిర్ణయం కాస్త ఉపశమనం కల్పించింది.

ఈ మార్పులను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ పరిధిలోని ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆసుపత్రులు, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం ఆదేశించింది.

నూతన మార్గదర్శకాలు ఇవే..

  • కొవిడ్‌ ఆరోగ్య కేంద్రం(ఆసుపత్రులు)లో చేర్చుకునేందుకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్దారణ పత్రం తప్పనిసరి కాదు. వైరస్‌ అనుమానిత బాధితులను ఆసుపత్రుల్లో చేర్చుకుని చికిత్స అందించాల్సిందే.
  • కారణమేదైనా సరే.. ఏ రోగికి కూడా వైద్య సేవలు నిరాకరించొద్దు. వేరే ప్రాంతానికి చెందిన రోగులకు కూడా ఆక్సిజన్‌ లేదా అత్యవసర ఔషధాలు ఇవ్వాలి.
  • వేరే నగరం నుంచి వచ్చిన బాధితులు సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించలేదని ఆసుపత్రుల్లో చేర్చుకోకుండా ఉండొద్దు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా.. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని చేర్చుకోవాలి.
  • అన్ని ఆసుపత్రులు డిశ్చార్జ్‌ పాలసీని కచ్చితంగా పాటించాలి. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆధారంగానే చేసుకునే ఆసుపత్రిలో చేర్చుకోవాలి. అంతగా హాస్పిటల్‌ అవసరం లేనివారిని డిశ్చార్జ్‌ చేయాలి.

ఈ నూతన మార్గదర్శకాలపై ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు మూడు రోజుల్లోగా ఉత్తర్వులు, సర్క్యులర్లు జారీ చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

Last Updated : May 8, 2021, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.