Republic Day 2022: దేశ గణతంత్ర వేడుకలను ఘనంగా జరిపేందుకు వాయుసేన ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా నిర్వహిస్తున్న 'స్వాతంత్ర్య అమృత మహోత్సవాల'లో భాగంగా.. 75 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో విన్యాసాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Air force flypast Republic day
ఎంఐ 17 ఎయిర్‌క్రాఫ్ట్‌లు నిర్వహించే ధ్వజ్ ఫార్మేషన్తో విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నాలుగు తేలికపాటి హెలికాప్టర్లతో 'రుద్ర', ఐదు హెలికాప్టర్లతో 'రాహత్' విన్యాసాలు జరగనున్నాయి. వాయుసేన చేపట్టే విన్యాసాల్లో రఫేల్, జాగ్వార్, మిగ్-29, చినూక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాల్గొననున్నాయి. వినాశ్ ఫార్మేషన్లో ఐదు రఫేల్ యుద్ధవిమానాలు రాజ్‌పథ్ మీదుగా ఎగురుకుంటూ వెళ్లనున్నాయని వాయుసేన వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నంది తెలిపారు. నేవీకి చెందిన మిగ్29కే, పీ8ఐ నిఘా విమానం వరుణ ఆకృతిలో విన్యాసాలు చేయనుందని వెల్లడించారు. 17 జాగ్వార్ విమానాలు 75 సంఖ్య వచ్చేలా ఎగురుతాయని వివరించారు.
Grandest Republic Day flypast
రిపబ్లిక్ డే రోజున జరగనున్న విన్యాసాలు.. అత్యంత వైభవోపేతమైన, భారీ కార్యక్రమంగా నిలుస్తుందని అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ విన్యాసాలు జరుపుతున్నట్లు తెలిపారు.
డకోటా, డోర్నియర్ విమానాలు.. విక్ ఆకృతిలో విన్యాసాలు చేస్తాయి. 1971 యుద్ధంలో నిర్వహించిన 'తంగైల్ ఎయిర్‌డ్రాప్' ఆపరేషన్‌కు గుర్తుగా తంగైల్ ఫార్మేషన్ చేపడతారు. ఓ చినూక్, నాలుగు ఎంఐ17ఎస్ హెలికాప్టర్లు కలిసి మేఘన వ్యూహంతో విన్యాసాలు చేస్తాయి.
ఇంకా ఏఏ విన్యాసాలు జరుగుతాయంటే..
- వినాశ్- ఐదు రఫేల్ యుద్ధవిమానాలు
- బాజ్- ఒక రఫేల్, రెండు జాగ్వార్లు, రెండు మిగ్ 29, రెండు సుఖోయ్ 30 యుద్ధవిమానాలు
- వరుణ(నావికా దళం)- ఓ పీ8ఐ, రెండు మిగ్ 29కేఎస్లు
- అమృత్- 17 జాగ్వార్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు 75 సంఖ్య వచ్చేలా విన్యాసాలు చేస్తాయి.
ఇదీ చదవండి: ఆ పది మంది సంపదతో పిల్లలందరికీ 25 ఏళ్లు విద్య ఫ్రీ!