ETV Bharat / bharat

'భయంతోనే చర్చ లేకుండా సాగు చట్టాల రద్దు' - సాగు చట్టాల రద్దు

సాగు చట్టాల రద్దు బిల్లును(The Farm Laws Repeal Bill 2021) ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ(Rahul gandhi news). అది ప్రభుత్వం చర్చలకు భయపడుతుంది అనేందుకు నిదర్శనమని, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలనుకుంటోందని ఆరోపించారు.

Rahul Gandhi
రాహుల్​ గాంధీ
author img

By

Published : Nov 29, 2021, 4:28 PM IST

ఎలాంటి చర్చ చేపట్టకుండా సాగు చట్టాలను రద్దు(farm laws repeal) చేయటం ప్రభుత్వం భయపడుతోందనేందుకు నిదర్శనమని ఆరోపించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ(Rahul Gandhi news). తప్పు చేశారని అర్థమవుతోందని విమర్శించారు.

నూతన సాగు చట్టాల రద్దు బిల్లుకు(The Farm Laws Repeal Bill 2021) పార్లమెంట్​ ఆమోదం తెలిపిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్​ గాంధీ. సాగు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని కాంగ్రెస్​ ముందే అంచనా వేసిందన్నారు. 3-4 క్యాప్టలిస్టుల శక్తి, రైతులు, కార్మికుల బలం ముందు నిలబడలేదని ఎద్దేవా చేశారు.

"సాగు చట్టాల రద్దు రైతులు, దేశ ప్రజల విజయం. ఇక్కడ బిల్లులను ఎలాంటి చర్చలు, సంప్రదింపులు లేకుండా ఏ విధంగా రద్దు చేశారనేదే దురదృష్టకరం. ఈ బిల్లుల వెనుక ఉన్న శక్తుల గురించి చర్చించాలనుకుంటున్నాం. ఈ బిల్లులు ప్రధాని అభిప్రాయాన్ని మాత్రమే ప్రతిబింబించటం లేదు, ఆయన వెనకున్న శక్తులను ప్రతిబింబిస్తున్నాయి. అందుకే చర్చించాలంటున్నాం. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

కనీస మద్దతు ధర, లఖింపుర్​ ఖేరి హింస(Lakhimpur kheri violence), సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో(Farmers protest) ప్రాణాలు కోల్పోయిన 700 మంది రైతుల అంశంపై మాట్లాడాలనుకుంటున్నామని, దురదృష్టవశాత్తు అందుకు అవకాశం ఇవ్వటం లేదన్నారు రాహుల్​. ఈ అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ భయపడుతోందనే నిజాన్ని ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. చర్చలు జరగనప్పుడు పార్లమెంట్​ ముఖ్య ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

పార్లమెంట్​లో సాగు చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం ఇలా..

పార్లమెంట్​ శీతాకాల సమావేశాల(parliament winter sessions) తొలిరోజునే విపక్షాల ఆందోళనలతో గందరగోళం ఏర్పడింది. లోక్​సభ ఓసారి వాయిదాపడి తిరిగి ప్రారంభంకాగానే.. కొత్త సాగు చట్టాల రద్దు బిల్లును(The Farm Laws Repeal Bill 2021) ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. బిల్లుపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారి డిమాండ్​ను తిరస్కరించిన స్పీకర్​ ఓం బిర్లా.. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపారు.

రాజ్యసభలో మధ్యాహ్నం లంచ్​ తర్వాత సాగు చట్టాల రద్దు(Farm laws repealed news) బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. దీనిపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్​ చేశాయి. అందుకు అంగీకరించకపోవటం వల్ల ఆందోళనకు చేపట్టాయి. విపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటు ద్వారా బిల్లుకు ఆమోదం తెలిపారు వైస్​ ఛైర్మన్​.

ఇదీ చూడండి: 'సాగు చట్టాల రద్దు' బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.