ETV Bharat / bharat

'చట్టాల రద్దుతో ఎన్నికల్లో భాజపాకు ప్రయోజనం శూన్యం!' - నూతన వ్యవసాయ చట్టం వార్తలు

వ్యవసాయ చట్టాల రద్దుపై (Farm Laws repeal) కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు కమిటీ సభ్యుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయం (Farm laws taken back) దురదృష్టకరమని, దీని వల్ల రైతుల ఆందోళనలు ఆగిపోవని అన్నారు. రాజకీయ కోణంలో తీసుకున్న ఈ నిర్ణయం (farm laws withdrawn) వల్ల.. భాజపాకు ప్రయోజనం కలగదని చెప్పారు.

Farm Laws repeal
Farm Laws repeal
author img

By

Published : Nov 19, 2021, 1:32 PM IST

మూడు సాగు చట్టాలను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం (Farm Laws repeal) దురదృష్టకరమని వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు, శెత్కారీ సంఘటన అధ్యక్షుడు అనిల్ ఘన్వాట్ పేర్కొన్నారు. రాజకీయ కోణంతో తీసుకున్న ఈ నిర్ణయంతో (Farm laws taken back) రైతుల ఆందోళన ఆగిపోదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వరకు నిరసన (farm laws withdrawn) కొనసాగించాలని రైతులు నిర్ణయించుకున్నారన్న ఘన్వాట్.. ఆందోళన తారస్థాయికి చేరినప్పుడు స్పందించని కేంద్రం, ఇప్పుడు వారికి తలవంచిందని (farm laws withdrawn) వ్యాఖ్యానించారు.

Farm Laws repeal
అనిల్ ఘన్వాట్

"సమస్య పరిష్కారం కోసం చట్టాలను ఉపసంహరించడానికి (farm laws withdrawn) బదులు ఇతర విధానపరమైన నిర్ణయాలను కేంద్రం తీసుకోవాల్సింది. కానీ, రైతుల ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది. యూపీ, పంజాబ్​లో గెలవాలని కేంద్రం ఈ నిర్ణయం (Farm laws taken back) తీసుకుంది. ఇది దురదృష్టకరం. దీనివల్ల (Farm Laws repeal) ఎలాంటి మంచి జరగదు. రైతులకు (చట్టాల్లో) స్వేచ్ఛ కల్పించారు. స్వాతంత్ర్యానికి ముందు ఆ తర్వాత జరిగినట్లుగా రైతులు ఇకపైనా దౌర్జన్యానికి గురవుతారు. పార్లమెంట్​లో ఆమోదించే సమయంలో సరిగా చర్చ జరిపి ఉంటే, లేదా పార్లమెంటరీ ప్యానెల్​కు సిఫార్సు చేసి ఉంటే.. చట్టాలు కొనసాగేవి."

-అనిల్ ఘన్వాట్

మూడు చట్టాల్లో రెండు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నాయని (Farm Laws repeal) ఘన్వాట్ గుర్తు చేశారు. కొత్త చట్టాల్లో (farm laws withdrawn) కొన్ని నిబంధనల అమలును నిలిపివేసినా.. పలు రాష్ట్రాలు అదే తరహా నిబంధనలను ప్రవేశపెట్టాయని చెప్పారు.

'నివేదికను మేమే విడుదల చేస్తాం'

ప్యానెల్ అందించిన నివేదికను (SC Panel farm laws) సుప్రీంకోర్టు విడుదల చేయకపోతే తామే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఘన్వాట్ తెలిపారు. ప్యానెల్ రిపోర్టు రైతులకు ప్రయోజకరంగానే ఉందని చెప్పారు. నివేదిక విడుదలపై వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామన్నారు.

ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్.. మార్చి 19న సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. అయితే, దీన్ని సుప్రీంకోర్టు బహిరంగపర్చలేదు. నివేదిక అంశాలను బయటకు వెల్లడించాలని సెప్టెంబర్ 1న ఘన్వాట్.. సీజేఐకి లేఖ రాశారు. కమిటీ సిఫార్సులు బయటకు వస్తే.. రైతుల ఆందోళనలు సద్దుమణిగే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు.

'రైతుల మంచికే'

మరోవైపు, చట్టాలు రద్దు చేయడం కేంద్రం నిర్ణయమని, ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్యానెల్ నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అందించిందని వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి పేర్కొన్నారు. నివేదికను పరిశీలించి చట్టాల రద్దుపై కేంద్రానికి సుప్రీంకోర్టు సూచనలు చేసేదని చెప్పారు. రైతులకు మాత్రం ఇది మంచికేనని అన్నారు. ఆందోళన చేస్తున్న అన్నదాతలు ఇప్పుడు నిశ్చింతగా ఉండొచ్చన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.