బంగాల్ నాలుగో విడత పోలింగ్ రోజున జరిగిన కూచ్‌బిహార్ కాల్పుల ఘటనను 'మారణహోమం' అని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. నిజాలను దాచిపెట్టేందుకే కూచ్బిహార్లో 72 గంటల పాటు రాజకీయ నాయకుల ప్రవేశంపై ఈసీ నిషేధం విధించిందని ఆరోపించారు. సిలిగుడిలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
"సీతల్‌కుచి ప్రాంతంలో నాలుగో విడత పోలింగ్ జరుగుతున్న వేళ.. బాధితుల మొండాలను గురి చూసి కేంద్ర బలాగాలు కాల్పులు జరిపాయి. ఇది మారణహోమమే. సీతల్‌కుచి ప్రాంతాన్ని ఏప్రిల్ 14న సందర్శించాలనుకుంటున్నాను. మనకో అసమర్థ హోం మంత్రి, అసమర్థ కేంద్ర ప్రభుత్వం ఉంది. పరిస్థితులను ఎలా చక్కదిద్దాలో సీఐఎస్ఎఫ్ బలగాలకు తెలియదు. కేంద్ర బలగాల్లోని కొంత మంది ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారనే విషయం మొదటి దశ పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను. నందిగ్రామ్‌లో ఈ విషయం చెప్పినప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు. "
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
శనివారం జరిగిన కాల్పుల్లో మృతిచెందిన నలుగురు వ్యక్తుల కుటుంబాలతో మమత ఫోన్లో మాట్లాడారు. ఏప్రిల్ 14న వారిని పరామర్శించేందుకు వస్తానని హామీ ఇచ్చారు.
-
#WATCH | West Bengal Chief Minister Mamata Banerjee spoke to the families of people, who had died in a firing incident at Cooch Behar, over a video call during her press conference in Siliguri
— ANI (@ANI) April 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
"I will come to meet you on April 14," she told them pic.twitter.com/NIHbn0CCnz
">#WATCH | West Bengal Chief Minister Mamata Banerjee spoke to the families of people, who had died in a firing incident at Cooch Behar, over a video call during her press conference in Siliguri
— ANI (@ANI) April 11, 2021
"I will come to meet you on April 14," she told them pic.twitter.com/NIHbn0CCnz#WATCH | West Bengal Chief Minister Mamata Banerjee spoke to the families of people, who had died in a firing incident at Cooch Behar, over a video call during her press conference in Siliguri
— ANI (@ANI) April 11, 2021
"I will come to meet you on April 14," she told them pic.twitter.com/NIHbn0CCnz
'మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్' గా మార్చండి'
అంతకుముందు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని.. 'మోదీ ప్రవర్తనా నియమావళి'గా మార్చాలని ట్విట్టర్ వేదికగా మమత ఎద్దేవా చేశారు.
"ఈసీ కచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎంసీసీ)ని.. మోదీ ప్రవర్తనా నియమావళిగా మార్చాలి. భాజపా ఎన్ని కుట్రలు చేసినా.. నా ప్రజల నుంచి నన్ను దూరం చేయలేరు. కూచ్‌బిహార్‌లోని నా అన్నదమ్ములను కలవకుండా నన్ను మూడు రోజులపాటు అడ్డుకోవచ్చు. కానీ నాలుగోరోజే నేను అక్కడుంటా."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
బంగాల్ నాలుగో విడత పోలింగ్ సందర్భంగా కూచ్‌బిహార్ జిల్లాలోని సీతల్‌కుచి ప్రాంతంలో ఘర్షణ తలెత్తింది. బలగాల కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో పర్యటించకుండా నిషేధం విధించింది ఈసీ.
ఇదీ చదవండి : ఆ జిల్లాలో నేతల పర్యటనపై నిషేధం