ETV Bharat / bharat

పిల్లల బొమ్మలతో 'రఫేల్'​ జెట్స్​కు ముప్పు! - పిల్లల రిమోట్​ కంట్రోల్​ బొమ్మలు

శత్రు దేశాల వెన్నులో వణుకుపుట్టించే రఫేల్​ జెట్స్​కు చిన్న పిల్లలు ఆడుకునే రిమోట్​ కంట్రోల్​ బొమ్మలతో ముప్పు ఉందని మీరు అనుకుంటారా? కానీ అది నిజం. అంబాలా ఎయిర్​బేస్​లో ప్రస్తుతం ఈ సమస్యపైనే అధికారులు ఆందోళన చెందుతున్నారు.

remote-control-toys-pose-threat-to-iaf-fighter-jets
పిల్లల బొమ్మలతో 'రఫేల్'​ జెట్స్​కు ముప్పు!
author img

By

Published : Feb 25, 2021, 3:23 PM IST

భారత వైమానిక దళానికి చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలతో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. హరియాణాలోని అంబాలా ఎయిర్​బేస్​కు సమీపంలో ఉన్న పిల్లల రిమోట్​ కంట్రోల్​ బొమ్మల వల్ల తమ ఫైటర్​ జెట్స్​కు ముప్పు పొంచి ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ బొమ్మల వల్ల ల్యాండింగ్, టేకాఫ్​ సమయంలో ప్రమాదాలు జరగొచ్చని భయపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు స్థానిక అధికార యంత్రాంగంతో మంతనాలు జరిపారు.

remote-control-toys-pose-threat-to-iaf-fighter-jets
అధికారుల సమీక్ష

" రఫేల్​ జెట్స్​ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం. వైమానిక స్థావరంలో ఎలాంటి పక్షులు సంచరించకుండా చూసేందుకు బృందాలను ఏర్పాటు చేశాం. నిబంధనలు ఉల్లంఘించిన ప్రజలపై కఠిన చర్యలు తీసుకుంటాం. పక్షులను ఎయిర్​ఫీల్డ్​ నుంచి దూరంగా ఉంచటం చాలా అవసరం. అది.. ఐఏఎఫ్​ బేస్​ పరిసరాల్లో చెత్త సేకరణను పెంచటం, విచ్చలవిడిగా చెత్తను పారేసే వారిపై జరిమానా విధించటం, పావురాల పెంపకంపై నిషేధం వంటి చర్యలతో సాధ్యమవుతుంది. చనిపోయిన పక్షులు, పారిశుద్ధ్యం వంటి ఇతర కీలక అంశాలపై చర్చించాం. "

- పార్థ గుప్తా, అంబాలా మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్

ఇదీ చూడండి: గంటకు 900కి.మీ వేగంతో 'రఫేల్' గర్జన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.