ETV Bharat / bharat

'నందిగ్రామ్ వేదికగా బంగాల్​ వ్యతిరేకులపై పోరు'

2007 నాటి నందిగ్రామ్​ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి టీఎంసీ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాళులు అర్పించారు. బంగాల్​ వ్యతిరేకులపై పోరాడేందుకే నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

author img

By

Published : Mar 14, 2021, 12:59 PM IST

Remembering villagers killed in 2007 Nandigram firing, Mamata says will fight against 'anti-Bengal forces'
'నందిగ్రామ్ వేదికగా బంగాల్​ వ్యతిరేకులపై పోరాడతా'

నందిగ్రామ్​ భూసేకరణ ఉద్యమకారులకు మమతా బెనర్జీ నివాళులర్పించారు. నాటి ఘటనను చీకటి అధ్యాయంగా అభివర్ణించిన దీదీ.. నందిగ్రామ్​ గడ్డ నుంచి బంగాల్​ వ్యతిరేకులపై పోరాడతానని ప్రకటించారు.

మార్చి 14ను టీఎంసీ 'నందిగ్రామ్​ దివస్​'గా పాటిస్తోంది.

నందిగ్రామ్ ఓటర్లను తన సోదర, సోదరీమణులుగా అభివర్ణించిన మమత.. వారిచ్చిన ప్రోత్సహంతోనే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. వారి మద్దతుతో బంగాల్ వ్యతిరేక శక్తులపై పోరాడతానని తెలిపారు. 2007 నాటి హింసలో అమరులైన వ్యక్తుల కుటుంబాలతో కలసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారు మమత.

ఇదే రోజు ఎంతోమంది అమాయకులను కాల్చి చంపారు. చాలా మృతదేహాలు కనీసం లభ్యం కాలేదు. చరిత్రలో అదొక చీకటి అధ్యాయం. నాడు ప్రాణాలొదిలిన వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నా.

-మమతా బెనర్జీ ట్వీట్.

2007లో తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని నందిగ్రామ్​లో ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్) ఏర్పాటు కోసం అప్పటి వామపక్ష ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమంలో 14 మంది మరణించగా.. అనేక మంది గాయపడ్డారు.

మళ్లీ వాయిదా..

తృణమూల్ కాంగ్రెస్​​ మేనిఫెస్టో విడుదల మళ్లీ వాయిదా పడింది. మార్చి 11నే ఎన్నికల ప్రణాళికను ప్రకటించాల్సి ఉండగా... మమత కాలికి గాయం వల్ల ఆదివారం ప్రకటిస్తామని టీఎంసీ నేతలు చెప్పారు. ఇప్పుడు మరోమారు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: యశ్వంత్ సిన్హా చేరిక తృణమూల్​కు లాభమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.