దేశంలో మతం పేరుతో కొందరు హింస, ఘర్షణను ప్రేరేపించాలని యత్నిస్తున్నారని.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అన్నారు. దేశం వెలుపల నుంచి కూడా కొందరు విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. దిల్లీలో జరిగిన సర్వమత సదస్సులో పాల్గొన్న ఆయన దేశ ఐక్యత కోసం అందరూ విభేదాలను పక్కనబెట్టి గొంతెత్తాలని సూచించారు. దేశం అన్ని వర్గాలు, మతాలు, కులాల కలయిక అన్న డోభాల్ ఇక్కడ ఏ మతాన్నైనా స్వేచ్ఛగా అనుసరించవచ్చని తెలిపారు. భారత పురోగతిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆయన దీనికి మతాన్ని వాడుకుంటున్నారని తెలిపారు. దేశాభివృద్ధి అన్ని మతాల ప్రజలకు మేలు చేస్తుందని అన్నారు.
వాటిని ఖండిస్తున్నాం: దేశంలోని తీవ్రవాద సంస్థలపై తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు ఆల్ ఇండియా సూఫీ నషీన్ పరిషద్ అధ్యక్షుడు హజ్రత్ సయిద్ నసీరుద్దీన్ చిస్తీ. ఇటీవల జరిగిన ఘర్షణలపై స్పందించిన చిస్తీ ఆ తరహా ఘటనలను ఖండిస్తున్నామన్నారు. సంబంధిత సంస్థలపై ఏ చిన్న ఆధారం దొరికినా తక్షణమే వాటిని నిషేధించాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : నదిలో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. త్రుటిలో తప్పించుకున్న బైకర్