ETV Bharat / bharat

జవాను​ను విడిపించాలంటూ జమ్మూలో నిరసన

మావోయిస్టుల చెరలో ఉన్న జవాను రాకేశ్వర్​ సింగ్​ మన్హాస్​ను విడిపించాలని నిరసన చేపట్టారు ఆయన బంధువులు. జవాను స్వస్థలం జమ్ముకశ్మీర్‌ బర్నాయ్‌లో ఆందోళన చేపట్టారు. తన భర్తను కాపాడాలని రాకేశ్వర్‌ భార్య మీనూ.. ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

CRPF
జవాన్
author img

By

Published : Apr 7, 2021, 3:03 PM IST

Updated : Apr 8, 2021, 6:22 AM IST

మావోయిస్టుల వద్ద బందీగా ఉన్న సీఆర్​పీఎఫ్ జవాను రాకేశ్వర్‌ సింగ్ మన్హాస్‌ను సురక్షితంగా కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ ఆయన బంధువులు నిరసన చేపట్టారు. జవాను స్వస్థలం జమ్ముకశ్మీర్‌ బర్నాయ్‌లో.. ఆందోళన చేపట్టారు.

రాకేశ్వర్‌ సింగ్‌ను.. మావోల చెరనుంచి విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని బంధువులు ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన భర్తను కాపాడాలని జవాన్ రాకేశ్వర్‌ భార్య మీనూ.. ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: 'నక్సలిజంపై విజయం తథ్యం'

ఇదీ చదవండి: అమిత్​ షా, యోగిని చంపుతామని బెదిరింపు మెయిల్

"నా భర్త మావోయిస్టుల చెరలో ఉన్నాడు. అతన్ని వెంటనే విడుదల చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దశాబ్దం నుంచి దేశం కోసం అతను పోరాడుతున్నారు. ఇప్పుడు దేశం అతన్ని విడుదల చేయడం కోసం పోరాడాలి."

-జవాను రాకేశ్వర్‌ భార్య మీనూ

రాకేశ్వర్‌ సింగ్ మన్హాస్‌ కూతురు ఒకటో తరగతి చదువుతోంది. ఆ చిన్నారి కూడా తన తండ్రిని విడిపించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది.

ఇదీ చదవండి: 15 మంది జవాన్లు మిస్సింగ్​- అమిత్​ షా ఆరా

ఇదీ చదవండి: జవాన్లపై 400 మంది నక్సలైట్ల ముప్పేట దాడి!

నక్సల్స్​ ఘాతుకం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో నక్సల్స్​కు, భద్రతా సిబ్బందికి మధ్య శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన జవాన్ల సంఖ్య 23కు చేరింది. శనివారం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. ఆదివారం మరో 18 మంది మృతదేహాలను గుర్తించారు. ఈ మేరకు బీజాపుర్​ ఎస్​పీ కమలోచన్​ కశ్యప్​ తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. కొంతమంది గల్లంతు కాగా అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

'శాంతి వ్యతిరేకులపై తమ పోరాటం కొనసాగుతుంది'

ఎన్​కౌంటర్​లో అమరులైన భద్రతా సిబ్బంది కుటుంబాలకు అమిత్​ షా సంతాపం తెలిపారు. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదని పేర్కొన్నారు. శాంతి వ్యతిరేకులపై తమ పోరాటం కొనసాగుతుందని ట్విట్టర్​ వేదికగా స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: అమర జవాన్లకు అమిత్​ షా నివాళి

మావోల బందీలో ఉన్న జవాన్​ ఫొటో విడుదల!

Last Updated : Apr 8, 2021, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.