ETV Bharat / bharat

ప్రేమించాడని.. యువకుడి మర్మాంగం కోసి దారుణ హత్య - యువతి సోదరుల హత్య

ప్రేమ వ్యవహారంలో ఓ యువతి సోదరులు క్రూరత్వానికి పాల్పడ్డారు. తన సోదరి ప్రేమించిన వ్యక్తిపై దాడి చేసి, మర్మాంగాన్ని కోసి హత్య చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితుని కుటుంబ సభ్యులు.. అతడి మృతదేహాన్ని నిందితుడి ఇంటి వద్దే దహనం చేశారు.

burnt dead body infront of house
ఇంటి ముందే మృతదేహం దహనం
author img

By

Published : Jul 25, 2021, 10:32 AM IST

నిందితుడి ఇంటి ముందే మృతదేహం దహనం

బిహార్​ ముజఫర్​పుర్​ జిల్లాలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ యువకుడిని.. తాను ప్రేమించిన యువతి సోదరులే అతి కిరాతకంగా హత్య చేశారు. దాంతో ఆగ్రహానికి గురైన బాధితుడి కుటుంబ సభ్యులు.. అతడి మృతదేహాన్ని నిందితుడి ఇంటి ముందే దహనం చేశారు.

అసలేం జరిగింది?

ముజఫర్​పుర్​ జిల్లా.. రామ్​పురుశాహ్​ ప్రాంతానికి చెందిన సౌరభ్​రాజ్(22)​.. సోనావర్ష గ్రామానికి చెందిన ఓ యవతి ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను వ్యతిరేకించిన యవతి సోదరులు దారుణానికి ఒడిగట్టారు. తన ప్రేయసి పిలుస్తున్నట్లుగా నమ్మించి సౌరభ్​ను తమ ఇంటి వద్దకు పిలిపించారు. అనంతరం.. అతడ్ని గదిలో బంధించి తీవ్రంగా దాడి చేశారు.

అంతేకాకుండా.. సౌరభ్​ మర్మాంగం కోసి చిత్రహింసలకు పాల్పడ్డారు. దాంతో తీవ్ర రక్తస్రావం కాగా చనిపోతాడని భావించిన నిందితులు.. సౌరభ్​ను ఓ ఆస్పత్రిలో చేర్చి పరారయ్యారు. అయితే.. అక్కడే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

సౌరభ్​ మృతితో అతడి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో అతని గ్రామస్థులంతా ఆగ్రహానికి గురయ్యారు. సౌరభ్​ మృతదేహానికి పోలీసులు పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం.. అతడి మృతదేహాన్ని నిందితుడి ఇంటి ముందుకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. మృతదేహాన్ని ఆ ఇంటివద్దే దహనం చేశారు. ఈ ఘటనలో పోలీసులు.. పలువురిపై కేసు నమోదు చేశారు. ఉద్రిక్తతలు నెలకొనగా.. పోలీసులు భారీగా మోహరించారు.

burnt dead body infront of house
ఇంటి ముందే మృతదేహం దహనం
burnt dead body infront of house
భారీగా మోహరించిన పోలీసులు

"రాత్రి 10 గంటల సమయంలో సౌరభ్​ మరణించాడనే వార్త తెలిసింది. మేమంతా ఆస్పత్రికి చేరుకుని రాత్రంతా అక్కడే ఉన్నాం. మరుసటి రోజు పోస్టు మార్టం తర్వాత మృతదేహాన్ని తీసుకుని మేము నిందితుడి ఇంటి వద్దకు వెళ్లాం. మాకు న్యాయం కావాలని మేం అక్కడే మృతదేహాన్ని దహనం చేశాం. మేం చేసింది తప్పైతే.. మమ్మల్ని శిక్షించండి. కానీ, మాకు న్యాయం చేయండి"

-మృతుడి బంధువు

ఒడిశాలోని ఓ ప్రైవేట్​ సంస్థలో సౌరభ్​ రాజ్​ పని చేస్తుంటాడని సమాచారం. తన సోదరి వివాహం ఉన్నందున జులై 1నే అతడు సెలవులపై ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: సోదరుని కళ్ల ముందే బాలికపై సామూహిక అత్యాచారం

ఇదీ చూడండి: గ్యాస్​ సిలిండర్​ లీకై మంటలు.. పొలాల్లోకి లాక్కెళ్లి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.