ETV Bharat / bharat

మద్యానికి డబ్బులివ్వలేదని కన్నతల్లిని కడతేర్చిన కుమారుడు - తల్లిని చంపిన కుమారుడు

Man Kills Mother: మద్యానికి డబ్బులివ్వలేదని కోపంతో కన్నతల్లినే కడతేర్చాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరో ఉదంతంలో.. తన పరుపుపై పడుకున్నాడనే కోపంతో స్నేహితుడితో ఓ వ్యక్తి ఘర్షణ పడ్డాడు. మిత్రుడు తిరిగి దాడి చేయగా.. ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

man kills mother
crime news
author img

By

Published : Mar 20, 2022, 7:38 AM IST

Man Kills Mother: కన్నతల్లినే కడతేర్చాడు ఓ కిరాతక తనయుడు. అది కూడా మద్యానికి డబ్బులివ్వలేదనే కారణంతో! ఉత్తర్​ప్రదేశ్​లోని షాజహానపుర్​లో శుక్రవారం సాయంత్రం ఈ దారుణం జరిగింది.

ఇదీ జరిగింది..

"ముక్రంపుర్​ గ్రామంలో నివసించే.. రామ్​ నరేశ్​ అనే వ్యక్తి మద్యం కోసం డబ్బులివ్వాలని తల్లి రామ్​వతిని అడిగాడు. ఆమె నిరాకరించడం వల్ల ఆగ్రహించిన నరేశ్​.. తల్లిపై దాడి చేశాడు. పదునైన వస్తువుతో తలపై కొట్టడం వల్ల ఆమె చనిపోయింది" అని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ప్రాణం తీసిన పరుపు!

పరుపు కోసం స్నేహితుడినే చంపేసిన దారుణ ఘటన శనివారం మహారాష్ట్రలో వెలుగుచూసింది. తన పరుపుపై రూమ్​మేట్​ దామోదర్​ దస్తాతివార్​ (45) పడుకున్నాడని సోనూ బంకర్​ (30) అనే వ్యక్తి.. ఆగ్రహం చెందాడు. దీంతో దామోదర్​పై చేయి చేసుకున్నాడు. బదులుగా బండరాయితో బంకర్​పై బలంగా మోదాడు దామోదర్​. దీంతో బంకర్​ అక్కడికక్కడే చనిపోయాడు. దామోదర్​ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: పోలీసులపై ఆగ్రహంతో స్టేషన్​కు నిప్పు.. కానిస్టేబుల్​ మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.