ETV Bharat / bharat

'ద్వితీయ శ్రేణి పౌరులుగా మైనారిటీలు! అలా చేస్తే దేశ విభజన ముప్పు!'

Raghuram rajan news: భారత ఆర్థిక పురోగతిపై రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘరామ్ రాజన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని, అందులోని సంస్థల్ని బలోపేతం చేయడంలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని రాజన్ అభిప్రాయపడ్డారు. పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూపించే ప్రయత్నం చేస్తే అది దేశాన్నే విభజిస్తుందని ఆయన విమర్శించారు.

raghuram rajan on indian economy
రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌
author img

By

Published : Jul 31, 2022, 2:28 PM IST

Raghuram rajan news: ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని, అందులోని సంస్థల్ని బలోపేతం చేయడంలోనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. ఆర్థిక పురోగతికి ఇది ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీలో ఒక విభాగమైన 'ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌' రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఐదో వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మెజారిటీవాదం బలపడి.. ఒకదేశ రాజకీయ నాయకులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగ సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవాలనుకుంటే శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తుతాయని రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూపించే ప్రయత్నం చేస్తే అది దేశాన్నే విభజిస్తుందని వ్యాఖ్యానించారు. ఫలితంగా దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం కూడా చోటుచేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. "భారత ఆర్థిక వృద్ధికి ఉదారవాద ప్రజాస్వామ్య అవసరమెంత" అనే అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో పురోగమించడం లేదని రాజన్‌ అభిప్రాయపడ్డారు. దేశ వృద్ధిరేటు మందగించడానికి కొవిడ్‌-19 సంక్షోభం ఒక్కటే కారణం కాదన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్‌ వృద్ధి ఆశించిన స్థాయిలో లేదన్నారు. యువకులకు అవసరమైన స్థాయిలో ఉద్యోగాలు సృష్టించలేకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారో చెప్పడానికి కొత్త సైనిక నియామకాల పథకం 'అగ్నిపథ్‌'పై చెలరేగిన ఆందోళనలే ఉదాహరణ అని వివరించారు. దేశంలో ఇప్పటికీ మెజారిటీ మహిళలు ఇంటికే పరిమితమవుతున్నారని తెలిపారు. అయినా, ఉద్యోగాల్లో పోటీ ఈ స్థాయిలో ఉండడం విచారకరమన్నారు. 35 వేల రైల్వే ఉద్యోగాల కోసం 1.25 కోట్ల దరఖాస్తులు రావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఇవీ చదవండి: అమ్మకు అదిరే 'రిటైర్​మెంట్​' గిఫ్ట్​.. హెలికాప్టర్​లో ఇంటికి..

'సోషల్​ మీడియా అకౌంట్ల డీపీ మార్చుకోండి'.. ప్రజలకు మోదీ పిలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.