Red Sandalwood Smuggling Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లోని కుంబారియా గ్రామంలో అల్లుఅర్జున్ 'పుష్ప' సినిమా రిపీట్ అయింది. ఓ రైతు.. మరో ఇద్దరితో కలిసి అక్రమంగా ఎర్రచందనాన్ని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం 548 కేజీలు ఉంటుందని ఏటీఎస్ అధికారులు అంచనావేశారు.
ఎర్రచందనాన్ని కేజీ రూ.1600 చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ధీరూ ఆహిర్, వినూ గోల్డెన్, ప్రవీణ్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు.
ఇదీ చూడండి: కారు- ట్రక్కు ఢీ.. నలుగురు మృతి, ఒకరికి తీవ్రగాయాలు