దిల్లీలోని ఎర్రకోట వద్ద చనిపోయిన కాకులకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు పరీక్షల్లో తేలింది. దాంతో ఎర్రకోటను జననవరి 26 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ చారిత్రక కట్టడాన్ని చూడడానికి ఎవరినీ అనుమతించటం లేదని తెలిపారు.
ఇటీవల ఎర్రకోట వద్ద దాదాపు 15 కాకులు చనిపోయాయి. అందులో ఒక నమూనాను బర్డ్‌ఫ్లూ పరీక్షకోసం జలంధర్ ల్యాబ్‌కు పంపించగా... వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.
ఇదీ చూడండి: బర్డ్ ఫ్లూ విసిరిన ఆ రెండు సవాళ్లు