ETV Bharat / bharat

సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు - రాజస్థాన్ న్యూస్​

రాజస్థాన్​లోని ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు కొట్టుకురావడం స్థానికులను షాక్​కు గురిచేసింది. పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లి వీటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే నకిలీవా, ఒరిజినలా తెలియాల్సి ఉంది.

Recovery of 30 bundles of Rs 2,000 notes
సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు
author img

By

Published : May 7, 2022, 3:48 PM IST

Ajmer lake currency notes: రాజస్థాన్​ అజ్మేర్​లోని ఆనాసాగర్ సరస్సులో 2000 రూపాయల నోట్ల కట్టలు తేలియాడాయి. పాలిథీన్​ బ్యాగులో ఉన్న వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్నీ రూ.2వేల నోట్లే అని అధికారులు చెప్పారు. పుష్కర్​ రోడ్డులోని ఈ సరస్సులో భారీగా కరెన్సీ నోట్లు ఉన్నాయని తమకు సమాచారం అందిందని, వచ్చి చూస్తే నిజంగానే నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పారు.

Recovery of 30 bundles of Rs 2,000 notes
సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు

Bundles of 2000 notes: అయితే ఈ నోట్లు నకిలీవా? లేక నిజమైనవా? అనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చూడటానికి మాత్రం నిజమైన నోట్ల లాగే ఉన్నాయని, నీటిలో తడవడం వల్ల నిర్ధారించుకోలేకపోతున్నట్లు చెప్పారు. నిపుణుల సాయంతో నోట్ల అసలువో, కాదో తెలుసుకుంటామన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నోట్ల కట్టలను పాలిథీన్​ బ్యాగులో పెట్టి సరస్సులో విసిరేశారని వివరించారు. మొదట నకిలీ నోట్లు అనుకున్నప్పటికీ, వాటిని చూశాక అసులవేమో అనే సందేహం వచ్చిందని అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి: యువతుల మధ్య చిగురించిన ప్రేమ.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.