నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. భారీ స్థాయిలో అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. తనఖీల్లో భాగంగా.. అక్రమంగా తరలిస్తున్న రూ.331 కోట్ల సొమ్ము బయటపడినట్టు వెల్లడించింది. 2016 ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న సొమ్ముతో పోలిస్తే.. ఇది అధికమని పేర్కొంది. స్వాధీనం చేసుకున్న మొత్తం సొమ్ములో.. తమిళనాడు వాటా రూ.127.64కోట్లు, బంగాల్ వాటా రూ.112.59 కోట్లని ఈసీ తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో మొత్తం 295 మంది అధికారులను నియమించినట్టు ఈసీ స్పష్టం చేసింది. వీరితోపాటు మరో ఐదుగురు ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు ఉన్నారని తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 259 స్థానాలను సున్నితమైనవిగా గుర్తించినట్టు చెప్పిన ఈసీ.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'నిర్ణయాత్మక చర్యలతోనే కరోనా 2.0 కట్టడి'