ETV Bharat / bharat

ఆయుష్మాన్​ భారత్​ కార్డుల జారీలో కొత్త రికార్డ్ - ఆప్​కే ద్వార్ ఆయుష్మాన్ ప్రచారం

ఒకే రోజు రికార్డ్​ స్థాయిలో ఆయుష్మాన్​ భారత్​ పథకం కింద లబ్ధిదారులను గుర్తించామని జాతీయ ఆరోగ్య విభాగం వెల్లడించింది. మార్చి 14న దాదాపు 8,35,089 లబ్ధిదారులను 'ఆప్​కే ద్వార్ ఆయుష్మాన్' కార్యక్రమంలో భాగంగా ధ్రువీకరించామని పేర్కొంది.

Record beneficiaries verified in single day under Ayushman campaign
ఒకే రోజు రికార్డ్​ స్థాయిలో ఆయుష్మాన్​ కార్డులు
author img

By

Published : Mar 16, 2021, 1:23 PM IST

మార్చి 14న దాదాపు 8,35,089 లబ్ధిదారులను 'ఆప్​కే ద్వార్ ఆయుష్మాన్' ప్రచారంలో ఆయుష్మాన్​ పథకం కింద​ ధ్రువీకరించామని జాతీయ ఆరోగ్య విభాగం వెల్లడించింది. ఆయుష్మాన్​ భారత్​ ప్రధాన్ మంత్రి జన్​ ఆరోగ్య యోజన ప్రారంభించిన నాటినుంచి ఒక్కరోజులో ఇంత భారీ స్థాయిలో లబ్ధిదారులను ధ్రువీకరించటం ఇదే మొదటిసారని స్పష్టం చేసింది.

లబ్ధిదారులను గుర్తించాలనే లక్ష్యంతో 'ఆప్​కే ద్వార్ ఆయుష్మాన్' ప్రచారాన్ని ఫిబ్రవరి 1 న ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఆయుష్మాన్​ భారత్​ పథకంపై అవగాహన పెంచుతున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాది 1.2కోట్ల ఆయుష్మాన్​ కార్డులను జారీ చేశారు.

ఆయుష్మాన్​ భారత్​ కార్డు ఉంటే... ఏడాదికి ఒక కుటుంబం రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య సేవలను పొందవచ్చు.

ఇదీ చదవండి: జన గణన ఈ ఏడాదిలోనే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.