ETV Bharat / bharat

ఆ నోటీసులపై.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏక్​నాథ్​ శిందే - మహారాష్ట్ర శివసేన

Rebel Shiv Sena MLA Eknath Shinde approaches Supreme Court

author img

By

Published : Jun 26, 2022, 8:10 PM IST

Updated : Jun 26, 2022, 9:01 PM IST

20:02 June 26

ఆ నోటీసులపై.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏక్​నాథ్​ శిందే

Eknath Shinde Supreme Court: శివసేన తిరుగుబాటు నేత ఏక్​నాథ్​ శిందే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర రెబల్​ ఎమ్మెల్యేలకు.. డిప్యూటీ స్పీకర్​ అనర్హత నోటీసులు అందించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పిటిషన్​ దాఖలు చేశారు. శివసేన శాసనసభా పక్ష నేతగా తనను తొలగిస్తూ.. అజయ్​ ఛౌదరిని నియమించడాన్ని కూడా సవాల్​ చేశారు శిందే.

జస్టిస్​ సూర్యకాంత్​, జస్టిస్​ జేబీ పర్దివాలా సభ్యులుగా గల వెకేషన్​ బెంచ్​.. ఈ పిటిషన్​ను సోమవారం పరిశీలించే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు కొందరు శివసేన ఎమ్మెల్యేలు. పార్టీ సీనియర్​ నేత, మంత్రి ఏక్​నాథ్​ శిందే ఈ వర్గానికి నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా అసోం గువాహటిలోని ఓ హోటల్​లో బస చేస్తున్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్​ భాగస్వాములుగా ఉన్న ప్రభుత్వం నుంచి శివసేన బయటికి రావాలని డిమాండ్​ చేస్తున్నారు శిందే. దీనిని వ్యతిరేకిస్తున్న సీఎం ఉద్ధవ్​ ఠాక్రే.. అసమ్మతివాదులు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నారు.
మహారాష్ట్ర విధానసభ సచివాలయం.. శిందే సహా 16 మంది శివసేన రెబల్​ ఎమ్మెల్యేలకు శనివారం అనర్హత వేటు నోటీసులు జారీ చేసింది. జూన్​ 27 సాయంత్రంలోగా దీనికి రాతపూర్వక సమాధానాలు ఇవ్వాలని అందులో స్పష్టం చేసింది.

తాజాగా శిందే శిబిరానికి మహారాష్ట్ర కేబినెట్​ మంత్రి ఉదయ్​ సామంత్ కూడా​ చేరుకున్నారు. ఈయన శిందే వర్గంలో చేరిన 9వ మంత్రి అని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన మంత్రులు నలుగురే ఉన్నారు. వారిలో ఎమ్మెల్యేగా ఉంది సీఎం ఉద్ధవ్​ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే మాత్రమే. మిగతా ముగ్గురు.. సీఎం ఉద్ధవ్​ ఠాక్రే, అనిల్​ పరబ్​, సుభాష్​ దేశాయ్​ ఎమ్మెల్సీలు.

వారికి భద్రత కల్పించండి: మరోవైపు శిందే వర్గంలోని ఎమ్మెల్యేలు సహా వారి కుటుంబసభ్యులకు తక్షణమే భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ.

ఇవీ చూడండి: 'ఆ 40 మంది బతికి ఉన్న శవాలు.. వచ్చాక అక్కడికే పంపిస్తాం'

రంగంలోకి రష్మీ.. ప్రభుత్వాన్ని కాపాడేందుకు తెరవెనుక రాజకీయం!

Last Updated : Jun 26, 2022, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.